Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ పై పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎటాక్ …ఖబర్దార్ కేసులుపెడతాం…

రేవంత్ పై పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎటాక్ …ఖబర్దార్ కేసులుపెడతాం
-నిషేదిత మావోల భాషను వాడుతున్నావ్ …ఓటుకు నోట్ కేసులో అడ్డంగా దొరికిన దొంగవు
-టీపీసీసీ పదవిని మాణిక్యం ఠాకూర్ వద్ద 25 కోట్లకు కొనుక్కున్నావ్
-నీతులు వల్లిస్తే నీతివంతుడివి అవుతావా ? మాపై మాట్లాడే హక్కు లేదు
-ఐపీసీ 502, 503 కింద రేవంత్ శిక్షార్హుడు
-మావోల భాషను వాడిన రేవంత్ ను నిషేధిత జాబితాలో పెట్టాలి
-రేవంత్ రాజకీయంగా ఎదగడమే వివాదాస్పదం
-పార్టీ మార్పు విషయంలో రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నాం
-మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన సుధీర్ రెడ్డి,గండ్ర

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై టీఆర్ యస్ ఎమ్మెల్యే ల ఎటాక్ ప్రారంభమైంది. వరస మీదకి సమావేశాలతో రేవంత్ పై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. మావోయిస్టుల భాష మాట్లాడుతున్నావ్ .నిన్నుకూడా నిషేదిత జాబితాలో చేర్చాలని ,పార్టీని కూడా నిషేదించాలని గండ్ర వెంకటరమణ రెడ్డి ఘాటుగా స్పందిచగా , రేవంత్ మాట్లాడే భాషకు తలాతోకా ఉండదని దానం నాగేందర్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు , టీపీసీసీ పదవిని మాణిక్యం ఠాకూర్ వద్ద 25 కోట్లు పెట్టి కొన్నుకున్న నీవా నీతులు వల్లించేది , మేము పద్దతి ప్రకారమే పార్టీ మారం నీకు మాట్లాడే అర్హత లేదని సుదీర్ రెడ్డి అన్నారు…..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్ రెడ్డి లు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచి టీఆర్ యస్ లోని వెళ్లిన వాళ్ళను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రేవంత్ రాజకీయంగా ఎదగడమే వివాదాస్పదమని ఆయన అన్నారు. నిషేధిత సంస్థలైన మావోయిస్టులు వాడే భాషను రేవంత్ వాడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన ఐపీసీ 502, 503 సెక్షన్ల కింద శిక్షార్హుడని అన్నారు. మావోయిస్టుల భాషను వాడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, ఆ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఖబర్దార్ రేవంత్ మాపై అవవసరంగా మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించారు.

2017లో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చినా… ఆయన ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసేంత వరకు ఎమ్మెల్యేగా కొనసాగింది నిజం కాదా? అని గండ్ర ప్రశ్నించారు. రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేయకపోతే… ఆయన ఆ పార్టీలో కొనసాగేవారా? అని నిలదీశారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగకు తమ గురించి మాట్లాడే హక్కులేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు . మాణికం ఠాగూర్ కు రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ పీఠాన్ని రేవంత్ కొనుక్కున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. మమ్మల్ని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన నిన్నే చెప్పులతో కొట్టాలి అంటూ హెచ్చరించారు.

ఆయనవి స్వార్థ రాజకీయాలని విమర్శించారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. తాము రాజ్యాంగం ప్రకారమే టీఆర్ఎస్ లో విలీనం అయ్యామని సుధీర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా పాల్గొన్నారు.

 

 

Related posts

నాటకీయ పరిణామాల మధ్య రాజీనామాను ఉపసంహరించుకున్న శరద్ పవార్…

Drukpadam

 పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేపై మధుయాష్కీ ఫైర్ …

Drukpadam

సుపరిపాలన కోసం మంచి నిర్ణయం…మాజీ ఎంపీ పొంగులేటి…

Drukpadam

Leave a Comment