Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నదీ జలాల పేరుతో కేసీఆర్, జగన్ విద్వేషాలు: తమ్మినేని వీరభద్రం…

నదీ జలాల పేరుతో కేసీఆర్, జగన్ విద్వేషాలు: తమ్మినేని వీరభద్రం
కోర్టు ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి: తమ్మినేని
జల వివాదం ఓ డ్రామా: దాసోజు శ్రవణ్
కేసీఆర్‌కు రైతు సంఘాల లేఖ

కృష్ణానది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలమధ్య జరుగుతున్నా మాటల యుద్ధం పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ,కాంగ్రెస్ అధికార ప్రథినిది దాసోజు శ్రావణ్ లు వేరు వేరు ప్రకటనలలో స్పందించారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య కేసీఆర్ , జగన్ లు విద్యేషాలు రెచ్చగొట్టడం తగదని తమ్మినేని అన్నారు. నీటి తగాదాలు పరిష్కరించేందుకు అనేక వేదికలు ,కేంద్రం ఉన్నాయని ,అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. రైతు సంఘాలు కూడా ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశాయి.

కృష్ణానది జలాలపై బ్రిజేష్ కుమారు ట్రిబ్యునల్ రెండవ తీర్పు రావాల్సి ఉందని దాన్ని త్వరగా ఇచ్చేందుకు కేంద్రంపై వత్తిడి తేవాలనే డిమాండ్ కూడా ఉంది అంటే కానీ రెండు రాష్ట్రాలమధ్య వైషమ్యాలు , ఘర్షణ వాతావరణం నెలకొలపడం వల్ల ప్రయోజనం లేదని పార్టీలు ప్రజాసంఘాల ,రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

నదీ జలాల పేరుతో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ట్రైబ్యునల్ వాటి తీర్పుల ఆధారంగా నీటి కేటాయింపుల్లో తేడాలు వస్తే కోర్టులను ఆశ్రయించవచ్చని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. కానీ అది మానేసి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

కాగా, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిన్న గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం ఓ డ్రామా అని విమర్శించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్-2 తీర్పు త్వరలోనే వెలువడేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ రైతు సంఘాల నాయకులు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

కేసీఆర్ కృష్ణానది జలాలపై సమిక్ష జరిపి ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమవుతున్న తరుణంలో కాంగ్రెస్ ,సిపిఎం ప్రకటనలకు ప్రాధాన్యత ఏర్పడింది.

Related posts

నా గుండె చెదరలేదు ..నా సంకల్పం మారలేదు… ప్లీనరీ లో జగన్ అద్భుత ప్రసంగం!

Drukpadam

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సంచలంగా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు …

Drukpadam

పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని సెటైరికల్ ప్రెస్ మీట్…ఆద్యంతం ఆశక్తి …

Drukpadam

Leave a Comment