Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీ మారను,షర్మిలకు శుభాకాంక్షలు …పీసీసీ ఇవ్వలేదనే భాదఉంది. కోమటిరెడ్డి…

పార్టీ మారను,షర్మిలకు శుభాకాంక్షలు …పీసీసీ ఇవ్వలేదనే భాదఉంది. కోమటిరెడ్డి
-అన్ని అర్హతలున్నా టీపీసీసీ పదవి ఇవ్వకకపోవడాతోనే విమర్శలు చేశా
-అంతమాత్రాన పార్టీ మారినట్టేనా?
-ఏ పార్టీలోకి వెళ్లట్లేదని స్పష్టీకరణ
-ఈ రోజు పార్టీని ప్రారంభిస్తున్న వైయస్ షర్మిల
-సభకు రావాలని తనకు ఆహ్వానం అందిందన్న కోమటిరెడ్డి
-వైయస్ గొప్ప నాయకుడని కితాబు

అన్ని అర్హతలున్నా టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వకుంటే బాధగా ఉంటుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆ బాధలోనే విమర్శలు చేశానే తప్ప తనకు వేరే ఉద్దేశాలేవీ లేవని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ను అధిష్ఠానం నియమించిన తర్వాత.. “పదవిని మాణిక్కం ఠాగూర్ రూ.25 కోట్లకు అమ్ముకున్నారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్టుంది. నన్నెవరూ కలవడానికి రావొద్దు’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా భువనగిరిలోని వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన మాట్లాడారు.

పార్టీ సీనియర్ నేతగా ఆవేదనతోనే ఆ విమర్శలు చేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామా చేశానని, తనకు పదవులు లెక్క కాదని అన్నారు. తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానం వచ్చిందని, తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో పరిణామాలపై విమర్శలు చేసినంత మాత్రాన పార్టీ మారినట్టేనా? అని ప్రశ్నించారు. పైసా తీసుకోకుండా కార్యకర్తలు తనను ఎంపీగా గెలిపించారని చెప్పారు.

వైయస్ షర్మిల తెలంగాణలో ఈరోజు కొత్త పార్టీని అధికారికంగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిలకు టీ.కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల పార్టీ సభ జరగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగి… వైయస్సార్ అభిమానులతో ఆయన కాసేపు ముచ్చటించారు. పార్టీ ఆవిర్భావ సభకు రావాలని తనకు కూడా ఆహ్వానం అందిందని చెప్పారు. వైయస్ గొప్ప నాయకుడని కొనియాడారు. వైయస్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయన విగ్రహానికి నివాళి అర్పించేందుకు వెళ్తున్నానని చెప్పారు.

 

Related posts

బొత్స ఛాంబ‌ర్‌లో న‌లుగురు మంత్రులు.. ఏం చ‌ర్చించారంటే..!

Drukpadam

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపకపోతే అధికారమెందుకు?…వైసీపీ పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్!

Drukpadam

కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వాల అసంతృప్తి…

Drukpadam

Leave a Comment