అమరజీవి కామ్రేడ్ అమర్నాథ్ కు వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్
–వివిధ రంగాల ప్రముఖులకు వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ పురస్కారాలు
–పత్రిక రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
పత్రిక రంగంలో విశిష్ట సేవల అందించిన 8 మంది ప్రముఖ సంపాదకులకు జర్నలిస్టలకు వైయస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు ప్రకటించడం అభినందనీయం . జర్నలిస్టుల ఉద్యమంలో కీలక పాత్ర పోషిచి ఇటీవలనే మరణించిన అమర్ నాథ్ ను కూడా ఈ అవార్డు కు ఎంపిక చేయడం పట్ల జర్నలిస్ట్ లోకం హర్షతిరేకలు వ్యక్తం చేస్తుంది.
పాత్రికేయ రంగ స్నేహితుడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్వ సభ్యుడు, జర్నలిస్టుల సంక్షేమం కోసం ‘కొట్లాడి’న కోసూరి అమర్ నాథ్ పేరును దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి 72 వ జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రముఖులకు ఇస్తున్న లైఫ్ టైం ఎచీవ్ మెంట్ పురస్కారాన్ని (posthumously) ప్రకటించడం జర్నలిస్టు ఉద్యమానికి లభించిన గౌరవంగా ఉంది . దివంగత సంపాదుకులు పొత్తూరి వెంకటేశ్వర రావు , ‘నిత్య యవ్వన’ సంపాదకులు ఏబికె, మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ వంటి ప్రముఖ పాత్రికేయల సరసన అమర్ నాథ్ పేరు వైఎస్ ఆర్ జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటంచడం ఇటీవలే దివంగతులైన పాత్రికేయ హక్కుల ఉద్యమ మిత్రుడికి నిజమైన నివాళి. వీరితోపాటు పొత్తూరి వెంకటేశ్వర రావు , షేక్ ఖాజా హుస్సేన్(దేవీప్రియ) సురేంద్ర – కార్టూనిస్ట్, కడప , తెలకపల్లి రవి – కర్నూలు, ఇమామ్ – అనంతపురం వివిధ రంగాల ప్రముఖులకు వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్స్ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల పలువురు పాత్రికేయ ప్రముఖులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని అభినందించారు.
పాత్రికేయ రంగంలో వై ఎస్ ఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుల జాబితా:
1 పాలగుమ్మి సాయినాథ్- చెన్నై
2 ఏబీకే ప్రసాద్- కృష్ణా
3 స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వర రావు- గుంటూరు
4 స్వర్గీయ షేక్ ఖాజా హుస్సేన్(దేవీప్రియ) – గుంటూరు
5 స్వర్గీయ కె. అమర్‌నాథ్- పశ్చిమ గోదావరి
6 సురేంద్ర – కార్టూనిస్ట్, కడప
7 తెలకపల్లి రవి – కర్నూలు
8 ఇమామ్ – అనంతపురం