Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం ప్రసక్తే లేదు: కోదండరామ్

కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం ప్రసక్తే లేదు: కోదండరామ్
కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనమవుతుందంటూ కథనాలు
కోదండరామ్ సుముఖంగా ఉన్నట్టు ప్రచారం
వివరణ నిచ్చిన కోదండరామ్
హుజూరాబాద్ ఎన్నికపై త్వరలో నిర్ణయమని వెల్లడి

తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు. కాంగ్రెస్ లో టీజేఎస్ ను విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే, జేఏసీగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాడుదామని గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేసింది మాత్రం వాస్తవమని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ చెప్పారు.

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక టీజేఎస్ కాంగ్రెస్ లో విలీనం అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. పంతులుగారు పార్టీని నడపలేక పోతున్నారని అందువల్ల తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేసేందుకు సిద్ధమైయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే పార్టీని విలీనం చేస్తానని చెప్పారని అందులో భాగంగానే పార్టీని విలీనం చేయబోతున్నారని ప్రచారం ఉపేందుకున్నది . ఈ నేపథ్యంలో పార్టీ విలీనం విషయంపై కోదండం ను పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆయన స్పందించారు. పార్టీ విలీనం ప్రతిపాదన ఏమి లేదని అవి అన్ని వట్టి మాటలని ప్రొఫెసర్ కొట్టి పారేశారు. రేవంత్ తాను పార్టీ అధ్యక్షుడిని అయితే కలిసి పనిచేద్దామని ప్రతిపాదన చేశారని అది సమస్యల మీద కలిసి పనిచేయడం కానీ కలిసిపోవడం కాదని అన్నారు. ఎలాంటి వార్తలు ప్రచారం చేయడం తగదని అన్నారు.

టీజేఎస్ ఏర్పడింది కొన్ని లక్ష్యాల కోసమని తనకు కొన్ని విధానాలు ఉన్నాయని అన్నారు. అంతే తప్ప పార్టీ ని విలీనం చేయడం ఏమిటి ? అని అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి… టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీజేఎస్ ను విలీనం చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నాడని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు కోదండరామ్ కూడా సానుకూలంగానే ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోదండరామ్ వివరణ ఇచ్చారు.

Related posts

ఫైటర్ షర్మిల …అడ్డంకులమధ్య 3500 కి .మీ పాదయాత్ర !

Drukpadam

కేసీఆర్ సొంత పొలంలో పండిస్తున్న వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారు? రేవంత్ రెడ్డి

Drukpadam

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం రండి.. జగన్, చంద్రబాబు, పవన్ సహా 37 పార్టీల అధినేతలకు స్టాలిన్ లేఖ!

Drukpadam

Leave a Comment