వర్జిన్ గెలాక్టిక్ రోదసియాత్ర విజయవంతం.. భూమికి తిరిగొచ్చిన! వ్యోమగాములు!
సురక్షితంగా ల్యాండైన యూనిటీ-22
పూర్తయిన మిషన్
అంతరిక్ష పర్యాటకంపై కొత్త ఆశలు
గంటపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు
ఆలస్యంగా అంతరిక్ష యాత్ర
ప్రతికూల వాతావరణమే కారణం
కొద్దిసేపటి క్రితమే తొలి ఘట్టం పూర్తి
న్యూ మెక్సికోలో మారిన వాతావరణం
90 నిమిషాలు ఆలస్యంగా రోదసియానం
ప్రపంచ కుబేరుడు, వర్జిన్ గ్రూప్ సంస్థల అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. కొద్దిసేపటి క్రితమే నింగికి ఎగిసిన వ్యోమనౌక గంట తర్వాత సురక్షితంగా తిరిగివచ్చింది. రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములతో కూడిన యూనిటీ-22 నౌక సురక్షితంగా భూమిపై ల్యాండైంది. భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న రిచర్డ్ బ్రాన్సన్ ఆశలకు ఈ విజయం మరింత ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.
కాగా, ఈ రోదసి యాత్రలో తెలుగమ్మాయి శిరీష బండ్ల పాల్గొనడం విశేషం. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసిలో ప్రవేశించిన మూడో భారత సంతతి మహిళగా శిరీష ఘనత సాధించింది.
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష యాత్రలో తొలి ఘట్టం పూర్తయింది. వర్జిన్ గెలాక్టిక్ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్, ఐదుగురు వ్యోమగాములతో వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌకతో కూడిన వీఎంఎస్ ఈవ్ స్పేస్ క్రాఫ్ట్ నింగికెగిసి తిరిగి వచ్చింది . వాస్తవానికి ఈ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో గంటన్నర పాటు వాయిదా వేశారు. న్యూ మెక్సికో నుంచి వీఎస్ఎస్ యూనిటీ-22 సహిత వీఎంఎస్ ఈవ్ రోదసి దిశగా దూసుకెళ్లింది.
ఈ నౌకలో తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. కాగా, ఆరుగురు వ్యోమగాములు 90 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉండి, ఆపై భూమికి తిరిగి విజయవంతంతంగా చేరుకున్నారు.
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు తొలుత అంతరాయం ఏర్పడింది . ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం) ఈ రోదసి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ యాత్ర ప్రారంభానికి వేదికగా నిలిచే న్యూ మెక్సికోలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని వర్జిన్ గెలాక్టిక్ వర్గాలు వెల్లడించాయి. దాంతో అంతరిక్ష యానం 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అయింది .
వర్జిన్ గెలాక్టిక్ చేపడుతున్న ఈ రోదసి యాత్ర కోసం యూనిటీ 22 వ్యోమనౌకను ఉపయోగించారు . ఇందులో వర్జిన్ గెలాక్టిక్ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములుతో భారత సంతతికి చెందిన శిరీష ఉన్నారు.