కోమటిరెడ్డి వెంకట రెడ్డి బీజేపీ లో చేరతారా ?
-అందుకే ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిశారా ??
-పార్టీని వీడేదిలేదని వెంకట రెడ్డి అంటున్న ఆగని ప్రచారం
తెలంగాణలో వారసత్వ సంపదగా భువనగిరి ఖిల్లా
అభివృద్ధికి నిధులు కేటాయించండి కేంద్ర మంత్రికి వినతి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతికి స్పందించిన మంత్రి
త్వరలో 300 కోట్లు భవనగిరి కోట అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని వెల్లడి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి …. భవనగిరి ఎంపీ , కాంగ్రెస్ పార్టీలో అసమ్మతినేతగా ముద్రపడ్డారు…. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్ళు ఉరారు … సీనియర్ గా ఉండటమే కాకుండా సీనియర్ నేతలంతా తనకే వస్తుందని తనకే ఇవ్వాలని కోరినందున పదవి తనకే కాయమనుకున్నారు. … సోనియాను , రాహుల్ ను కలిశారు. … కాని అధిష్టానం ఆయనకు పదవి ఇవ్వలేదు ఫలితంగా ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డిపై మండి పడ్డారు . తనను కలిసేందుకు ప్రయత్నం చేయవద్దని ఘింకరించారు…. పార్టీ కార్యాలయం గాంధీ భవన్ మెట్లు వెక్కనని శపథం చేశారు. పార్టీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి భాద్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరుకాలేదు. దీనితో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. అయితే పలుమార్లు తాను పార్టీ మారానని చెబుతున్న జరుగుతున్న ప్రచారం ఆగటంలేదు . అందుకు కారణం లేకపోలేదు. షర్మిల తెలంగాణ ఏర్పాటు చేస్తున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ కు శుభాకాంక్షలు తెలిపారు . ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఆయనకు కేంద్రంలో కెబినెట్ మంత్రి గా ప్రమోషన్ లభించినందున మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పిన ఇందులో రహస్య ఎజెండా ఉండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆయన సోదరుడు మునుగోడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. తర్వాత పార్టీ మారానని అన్నారు. తిరిగి బీజేపీలో చేరతానని అన్నారు. రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కార్యక్రమానికి ఆయన కూడా గైర్హాజరు అయ్యారు. దీంతో పార్టీ మీద కోపంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో ఏదైనా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
భవనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి
ఎంతో చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి లేఖను న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైనందుకు అభినందనలు తెలిపారు. మీరు నూతనంగా చేపట్టిన పర్యాటక రంగంలో నూతన విధానాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కోట అభివృద్ధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ వ్యక్తిగా కిషన్ రెడ్డికి బోనగిరి కోట విశిష్టత తెలుసని వివరించారు. ప్రత్యేక తెలంగాణలో రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధికి సహకరించడం లేదని వెల్లడించారు. నేటికి దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో చరిత్రలో కలిసి పోయాయని.. పట్టించుకోకుంటే బోనగిరి కోట అలాగే అవుతుందని తెలిపారు.
భారతదేశం యొక్క గత వారసత్వ సంపదకు ఈ కోట నిర్మాణం సాక్షిగా నిలుస్తుందని తెలిపారు. ఇది చాళుక్య పాలకుడు, 6వ త్రిభువనమల్ల విక్రమాదిత్య చేత నిర్మించబడిన ఈ భారీ కోటకు అతని పేరు పెట్టారని వివరించారు. భువనగిరి కోట చరిత్ర 10 వ శతాబ్దానికి చెందినదని..ప్రారంభంలో దీనిని త్రిభువనగిరి అని పిలిచేవారు, తరువాత దీనిని భువనగిరి అని పేరు మార్చారని ఇక చివరికి ఇది బోనగిరి కోటగా మారిందన్నారు. భువనగిరి పట్టణం ఈ అద్భుత కోట పేరు మీదుగానే వచ్చిందని తెలిపారు.ఈ కోట 50 ఎకరాల విస్తీర్ణంలో 500 అడుగుల ఎత్తులో విస్తారమైన శిలల నిర్మాణమని.. కందకంలో చుట్టుముట్టబడిన ఈ కోటలో భూగర్భ గది ఉందని, ఇది 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ కోటను అనుసంధానిస్తుందని నమ్ముతారని వివరించారు. ఈ కోట రాణి రుద్రమదేవి మరియు ఆమె మనవడు ప్రతాప రుద్ర పాలనలో ఒక అద్భుతమైన కొత్తగా కీర్చించబడిందని తెలిపారు. కాబట్టి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నమీరు నిధులు మంజూరు చేయాలని కోరారు.
దీనికి అనుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి త్వరలో రూ. 300ల కోట్లను మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారని వివరించారు.