Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలుక్రైమ్ వార్తలు

ఇరాక్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 44 మంది మృత్యువాత…

ఇరాక్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 44 మంది మృత్యువాత
-మరో 67 మందికి తీవ్ర గాయాలు-మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
-ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో అంటుకున్న మంటలు
-నసిరియా పట్టణంలో ఘటన-ప్రధాని అత్యవసర సమావేశం
-ఆరోగ్య సివిల్ ,డిఫెన్స్ మేనేజర్లను అరెస్ట్ చేయాలనీ ప్రధాని ఆదేశాలు
-గతంలోనూ ఇదే పట్టణంలో ఘటన

ఇరాక్ లోని నసిరియా పట్టణంలో రెండవసారి కోవిద్ ఆసుపత్రిలో అతిపెద్ద ప్రమాదం జరిగింది. గతంలో జరిగిన సంఘటనలో 82 మంది మృత్యువాత పడ్డారు . ఈసారి 44 మరణించగా మరో 67 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై ఈ దేశ ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు బాద్యులైన అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీచేశారు. సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు కూడా ఆదేశాలు జారీచేశారు.

ఇరాక్‌లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 44 మంది సజీవ దహనమయ్యారు. నసిరియా పట్టణంలోని అల్-హుస్సేన్ కొవిడ్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి వార్డులను చుట్టుముట్టేశాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

కాగా, ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా మరో 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా వారిని మరో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇక్కడ గత ఏప్రిల్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కొవిడ్ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికిపైగా గాయపడ్డారు.

ఘటన జరిగిన వెంటనే సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన ప్రధాని ముస్తాఫా అల్-కదిమి నసిరియాలోని ఆరోగ్య, సివిల్ డిఫెన్స్ మేనేజర్లను సస్పెన్షన్ చేయాలని, అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆసుపత్రి మేనేజర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు త్వరలోనే అరెస్ట్ చేయనున్నారు.

Related posts

మిస్టరీగా మారిన చైనా విమాన ప్రమాద ఘటన!

Drukpadam

మళ్ళీ కరోనా కేసులు …మహారాష్ట్రలో ఇద్దరు మరణం …

Drukpadam

పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయి.. ఆయన వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్!

Drukpadam

Leave a Comment