Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ ఎంపీ అర్వింద్ సోదరుడు కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం

బీజేపీ ఎంపీ అర్వింద్ సోదరుడు కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం
-దూకుడు రాజకీయాలకు రేవంత్ ప్రాధాన్యం
-రేవంత్ నాయకత్వంపై నేతల నమ్మకం
-కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్న నేతలు

రేవంత్ అధ్యక్ష భాద్యతలు చేపట్టాక కాంగ్రెస్ లో కదలిక ప్రారంభమైందని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే కొన్ని మైనస్ లు కూడా లేక పోలేదు . రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహిరిస్తారనే దానిలో ఎలాంటి సందేహాలు లేవు . ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్ ఉత్తర తెలంగాణ పర్యటనకు వెళ్లారు . నిజామాబాద్ లో మాజీ కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు సంజయ్ రేవంత్ తో భేటీ అయ్యారు . అనంతరం తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సంజయ్ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు కావడం విశేషం …

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటున్నాయి ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు బీజేపీ లో చేరగా ఇప్పుడు బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు చేస్తున్నారు. . పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న వారిలో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా ఉన్నారు. సంజయ్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు. సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, భూపాలపల్లి బీజేపీ నేత గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.

దీనిపై ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగానని, తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కోసమే టీఆర్ఎస్ లో చేరానని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని వివరించారు.

అటు, మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎర్ర శేఖర్ ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధ్యక్ష పదవిలోకి వచ్చాక రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షించడంలో సఫలమవుతున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు అప్పగించడంతో కాంగ్రెస్ పుంజుకోవడంపై అంచనాలు బలపడుతున్నాయి.

Related posts

కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే టీపీసీసీ కమిటీలు …

Drukpadam

ధర్మాన సంచలన ప్రకటన …సీఎం జగన్ అనుమతి ఇస్తే మంత్రి పదవికి రాజీనామా.. ?

Drukpadam

పొంగులేటి ఆధ్వరంలో కలక్టరేట్ కు రైతు భరోసా యాత్ర ఉద్రిక్తత…

Drukpadam

Leave a Comment