కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన మంద కృష్ణ మాదిగ
కారు ముందు సీట్లో కూర్చున్న మహేశ్ చనిపోయాడు
పక్క సీట్లో కూర్చున్న వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదు
మహేశ్ కూర్చున్న వైపే కారు డ్యామేజ్ అయింది
సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురై, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. కారులో ముందు సీట్లో కూర్చున్న కత్తి మహేశ్ చనిపోయాడని… అదే కారులో పక్కనే కూర్చున్న వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదని అన్నారు.
కత్తి మహేశ్ కూర్చున్న వైపే కారు డ్యామేజ్ కావడం అనుమానాలకు తావిస్తోందని మంద కృష్ణ చెప్పారు. మహేశ్ కి ఎంతో మంది శత్రువులు ఉన్నారని తెలిపారు. తొలుత కత్తి మహేశ్ కి గాయాలే కాలేదని చెప్పారని అన్నారు. ఆసుపత్రిలో మహేశ్ ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు పెట్టారని చెప్పారు. కత్తి మహేశ్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదం జరిగిన రోజున డ్రైవర్ మాట్లాడుతూ కత్తి మహేష్ కేవలం సీట్ బెల్ట్ పెట్టుకోనందునే చనిపోయారని అన్నారు.తాను సీట్లు బెల్ట్ పెట్టుకున్నందున బయట పడ్డానని అన్నారు. ముందు నెల్లూరు ఆసుపత్రి లో చేర్పించిన మహేష్ ను అక్కడ నుంచి చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.అక్కడ మంచి వైద్యం జరుగుతుందని కంటికి మాత్రమే బలమైన గాయమైందని ప్రకటించారు. తరువాత కన్ను కూడా పని చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అంత బాగానే ఉందని ఆయన కోలుకుంటున్నారని అందరు భావించారు. ఏపీ ప్రభుత్వం ఆయన వైద్య ఖర్చులకు గాను 17 లక్షలను కూడా విడుదల చేసింది. దీనిపై అనేక అవిమర్శలు వచ్చాయి.అదే వేరే విషయం .కానీ ఇంతలోనే చెడ్డవార్త వచ్చింది. ఆయన ఇకలేరని … దీంతో ఆయన అభిమానులు ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురైయ్యారు. దీనిపై విచారణ జరపాలని మంద కృష్ణ డిమాండ్ చేస్తున్నారు…..