Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

డబుల్ బెడ్ రూమ్ ల పేరుతొ అసలు ఇల్లులేకుండా చేస్తున్న తెలంగాణ సర్కారు:తమ్మినేని…

డబుల్ బెడ్ రూమ్ ల పేరుతొ అసలు ఇల్లులేకుండా చేస్తున్న తెలంగాణ సర్కారు
డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి పేదలకు ఇవ్వాలి
పేదల స్వంత ఇంటి కలను నిజం చేయాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్‌….

తెలంగాణ రాష్ట్రంలో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి అర్హులైన పేదలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. కేసిఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఉన్న గహ నిర్మాణ పథకాలను రద్దు చేసి డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించి నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రకటించిందని సోమవారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు.

జీహెచ్‌ఎంసీలో 2 లక్షలు, వివిధ పెద్ద పట్టణాలలోని అర్హులైన పేదలందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని వివిధ సందర్భాలలో ప్రకటించిందని తెలిపారు. ఏడున్నర ఏండ్లు దాటినా నేటికీ పూర్తిస్థాయిలో ఇంటినిర్మాణాలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లనూ లబ్దిదారులకు కేటాయించడంలేదని విమర్శించారు.

పేదలు కరోనా సమయంలో ఉపాధి లేక, అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రని వివరించారు. ఇప్పటివరకూ సుమారు 5 వేల ఇండ్లు మాత్రమే పూర్తిచేసి పేదలకు అందజేశారని పేర్కొన్నారు. ఇంకా అనేకచోట్ల వివిధ దశలలో నిర్మాణాలు ఆగిపోయాయని తెలిపారు. కాంట్రాక్టర్లు బిల్లులు రాక పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. కొన్నిచోట్ల పనులు సగంలో ఆగిపోవడంతో ఆ ఇండ్లు మొండిగోడలతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయని వివరించారు.

పెట్టుబడి వృధా కావడంతోపాటు నిర్మాణాలు శిథిలమవడంతో పేదలకు ఇండ్లను అందించే లక్ష్యం నెరవేరదని సూచించారు. మరోపక్క గతంలో వివిధ గహ నిర్మాణ పథకాలైన రాజీవ్‌ స్వగహ, పీఎం అవాస్‌ యోజన, హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు, ఇతరులకు నిర్మిస్తున్న గహాలు, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఇండ్లు ఉన్నాయని తెలిపారు. వాటిన్నింటిపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వివిధ దశలలో, వివిధ పథకాల కింద ఉన్న అన్ని గహాలనూ ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల స్వంత ఇంటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికిసూచించారు.

Related posts

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు … రాహుల్ గాంధీ పాదయాత్రకు రోడ్ మ్యాప్ …

Drukpadam

కిర‌ణ్ కుమార్ రెడ్డి సేవ‌లు కాంగ్రెస్‌కు అవ‌స‌రం: ఏఐసీసీ సెక్ర‌ట‌రీ మ‌య్య‌ప్ప‌న్‌!

Drukpadam

వద్దిరాజు రాజ్యసభకు @ ఏడాది …ఇనగుర్తి నుంచి అత్యన్నతి సభకు..

Drukpadam

Leave a Comment