Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పోతిరెడ్డిపాడు లిఫ్ట్ పై చంద్రబాబు వైఖరేంటో స్పష్టం చేయాలి: సజ్జల…

పోతిరెడ్డిపాడు లిఫ్ట్ పై చంద్రబాబు వైఖరేంటో స్పష్టం చేయాలి: సజ్జల
ఇటీవల సీఎంకు లేఖ రాసిన ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు
స్పందించిన సజ్జల
చంద్రబాబు కుట్ర అంటూ వ్యాఖ్యలు
ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాడని ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లమధ్య కృష్ణానది జలాల వినియోగం విషయంలో పెద్ద ఎత్తున మతాల యుద్ధం జరుగుతున్న వేళ ,సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రాంతం నుంచే పోతిరెడ్డిపాడు వాళ్ళ తమ ప్రాంతానికి నీళ్లు రావడంలేదని లేఖలు రాయడంపై వైసీపీ మండి పడుతుంది . అందరం కలిసి పొరుగు రాష్ట్రంపై పోరాడాల్సింది పోయి ఇక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు లేఖలు రాయడంపై తీవ్ర విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఇది చంద్రబాబు కుట్రలో భాగమేనని వైసీపీ ఆరోపిస్తుంది.

రాయలసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు లేఖ రాయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. జిల్లాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అందుకే సీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖ రాయించారని, తెలంగాణకు అనుకూలంగా ఎన్జీటీలో కేసులు వేయించారని ఆరోపించారు.

పుట్టిన ప్రాంతం, రాష్ట్రంపై చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు. తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని సజ్జల ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద లిఫ్ట్ ఏర్పాటుపై చంద్రబాబు వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల గోడు పట్టదని, ఎంతసేపూ అధికారంపైనే దృష్టి అని విమర్శించారు. చంద్రబాబువి అర్థంలేని ప్రేలాపనలు అని, తానేం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని వ్యాఖ్యానించారు.

Related posts

పట్టు -బెట్టు

Drukpadam

డ్రగ్స్ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు …సిపిఐ నారాయణ ధ్వజం !

Drukpadam

జగన్ ,షర్మిల మధ్య విబేధాలు…?

Drukpadam

Leave a Comment