Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటలపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు…

ఈటలపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు
టీఆర్ఎస్ లో ఉంటూనే ఇతర పార్టీలతో ఈటల సంప్రదింపులు జరిపారు
ఈటలకు టీఆర్ఎస్ అన్యాయం చేయలేదు
2003లో కష్టమైనా ఈటలకు టికెట్ ఇచ్చాం
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది
బీజేపీవి చిల్లర రాజకీయాలు -బండి సంజయ్ పాదయాత్ర ఎందుకో చెప్పాలి

ఈటల రాజేందర్ కు టీఆర్ యస్ ఎప్పడు అన్యాయం చేయలేదని పార్టీకి ఇబ్బంది అయినప్పటికీ టికెట్ ఇచ్చామని , ఆయనే పార్టీలో ఉంటూనే ఇతరపార్టీలతో సంప్రదింపులు జరిపారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉంటూనే తన అభిప్రాయాలను కాబినెట్ లో చెప్పకుండా బయట చెప్పేవారని ఇదేనా పార్టీ ఆయనకు చేసిన ద్రోహం అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఇందుకు పాదయాత్ర చేయాలనుకున్నారో ఆయనకే క్లారిటీ లేదన్నారు. ఒక్క నిరుద్యోగ సమస్య తప్ప అన్ని సమస్యలని ప్రభుత్వం అడ్రస్ చేసిందని అన్నారు . హుజురాబాద్ లో టీఆర్ యస్ పార్టీ ఘనవిజయం సాదిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈటలకు టీఆర్ఎస్ అన్యాయం చేయలేదని అన్నారు. 2003 ఎన్నికల్లో ఎంతో కష్టమైనా ఈటలకు టికెట్ ఇచ్చామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో పదవులను అనుభవిస్తూనే… ఇతర పార్టీలతో ఈటల సంప్రదింపులు జరిపారని దుయ్యబట్టారు.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అక్కడే మాట్లాడితే పోయేదని… అయితే సానుభూతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి పార్టీకి ఆయనే దూరమయ్యారని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ పార్టీల మధ్యే ఉంటుందని, వ్యక్తుల మధ్య కాదని అన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో బండి సంజయ్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఏడేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యపై తప్ప విపక్షాలకు మాట్లాడేందుకు మరో అంశం లేదని చెప్పారు.

Related posts

తెలంగాణ రాజకీయాల్లో నూతన పరిణామం!లెఫ్ట్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ !!

Drukpadam

సీఎం ఆదిత్యనాథ్ “అబ్బా జాన్” వ్యాఖ్యలపై మండిపడిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా…

Drukpadam

టీఆర్ఎస్ అవినీతిపై పోరు కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం!

Drukpadam

Leave a Comment