Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీలో ఈటల ,బండి సంజయ్ …అమిత్ షా తో భేటీ -రాష్ట్ర పరిస్థితులపై వివరణ…

ఢిల్లీలో ఈటల ,బండి సంజయ్ …అమిత్ షా తో భేటీ
-రాష్ట్ర పరిస్థితులపై వివరణ
-తెలంగాణకు ఎన్నిసార్లు అయినా వస్తానన్న అమిత్ షా
-ఈటల రాజేందర్ గెలుస్తారని చెబుతున్న సర్వే రిపోర్టులు: బండి సంజయ్
-ఈటల బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలుద్దామనుకున్నాం
-హుజూరాబాద్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ భయపడుతోంది
-టీఆర్ఎస్ కు అభ్యర్థి కూడా దొరకడం లేదు
-అమిత్ షాకు రాష్ట్ర పరిస్థితులను వివరించాం: ఈటల రాజేందర్
-అమిత్ షాతో భేటీ అయిన బండి సంజయ్, ఈటల
-తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని అమిత్ షా చెప్పారన్న ఈటల
-హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీనే అని ధీమా

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన ఇద్దరు నేతలు అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీలో చేరిన తర్వాత అమిత్ షాతో ఈటల భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

భేటీ అనంతరం మీడియాతో ఈటల మాట్లాడుతూ, రాష్ట్ర పరిస్థితులను అమిత్ షాకు వివరించామని చెప్పారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని అమిత్ షా చెప్పారని అన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నిసార్లు అయినా రాష్ట్రానికి వస్తానని తెలిపారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేసినా హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీనే అని అన్నారు. మరోవైపు అమిత్ షాను బండి సంజయ్, ఈటలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ కూడా కలిశారు.

బండి సంజయ్ మాట్లాడుతూ …..

సమావేశానంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ…. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలుద్దామనుకున్నామని… అయితే ఆరోజు కుదరలేదని చెప్పారు. అందుకే సమయం తీసుకుని ఈరోజు ఢిల్లీకి వచ్చి కలిశామని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలవబోతున్నారని సర్వే రిపోర్టులు వచ్చాయని చెప్పారు.

తెలంగాణలో నిర్వహించబోయే బహిరంగసభకు వస్తానని అమిత్ షా చెప్పారని బండి సంజయ్ తెలిపారు. అదే విధంగా తాము చేపట్టబోతున్న పాదయాత్రకు కూడా ఆయనను ఆహ్వానించామని చెప్పారు. ఆగస్టు 9వ తేదీన తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఉపఎన్నిక గురించి టీఆర్ఎస్ భయపడుతోందని… వారికి అభ్యర్థి కూడా దొరకడం లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా ఓటర్లు తీసుకోవాలని… ఎందుకంటే వాళ్లు పంచేది అవినీతి సొమ్మని చెప్పారు. తెలంగాణలో అవినీతి, అరాచక, అక్రమ పాలనను అంతం చేయడానికే పాదయాత్రను చేపడుతున్నామని అన్నారు.

Related posts

యూపీ లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ …కలవరపడుతున్న అధిష్టానం!

Drukpadam

జగన్ పాలనపై పవన్ కళ్యాణ్ నిప్పులు… క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమని ప్రకటన!

Drukpadam

పవన్ ఏపీ పర్యటన ఉద్రిక్తం … గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ఫ్యాన్స్ అడ్డుకున్న పోలీసులు

Drukpadam

Leave a Comment