Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నాడు కమీషన్ల కోసం కక్కుర్తి పడిన కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు: బండి సంజయ్

నాడు కమీషన్ల కోసం కక్కుర్తి పడిన కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు: బండి సంజయ్
గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం
వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
గతంలో ఏపీతో కుమ్మక్కయ్యారన్న బండి సంజయ్
కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

నదీ యాజమాన్య బోర్డుల అధికారాలపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. గెజిట్ నోటిఫికేషన్ ను టీఆర్ఎస్ సర్కారు వ్యతిరేకిస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు చేశారు. నాడు కమీషన్ల కోసం కక్కుర్తిపడిన సీఎం కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే, కేవలం 299 టీఎంసీలకే అంగీకరించిన కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు.

“తెలంగాణకు రావాల్సిన నీటివాటాపై ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి దోచుకుపోతుంటే ఈయన చూస్తూ ఉన్నాడు తప్ప అడ్డుకోవడంలేదు. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను కాకుండా, అంతకు తక్కువ కేటాయింపులకు సీఎం కేసీఆర్ ఎలా ఒప్పుకొన్నారు? ఇది ఆయన జాగీరా, ఆయన అబ్బ జాగీరా? ప్రత్యేక అజెండాతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మొట్టమొదటి ప్రధాన అంశం నీళ్ల విషయంలోనే కేసీఆర్ మోసం చేశారు. పక్క రాష్ట్రంతో కుమ్మక్కై కమీషన్ల కోసం తెలంగాణను మోసం చేసిన దౌర్భాగ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ కు ఏమాత్రం నిజాయతీ ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Related posts

కేసీఆర్ సార్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి : పల్లెప్రగతి దత్తతపై విజయశాంతి హాట్ కామెంట్స్…

Drukpadam

కాంగ్రెస్ అడ్రెస్స్ గల్లంతేనా ? బీజేపీ దే హవా??… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

Drukpadam

పీకే రాహుల్ పై ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.యూ టర్న్ కు కారణం ఏమిటి ?

Drukpadam

Leave a Comment