Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ బెయిలు రద్దయితే ఏమవుతుందో చెప్పిన సీపీఐ నారాయణ!

జగన్ బెయిలు రద్దయితే ఏమవుతుందో చెప్పిన సీపీఐ నారాయణ
రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం మాత్రం రద్దవుతుంది
జగన్ బెయిలు రద్దు చేయాలని పిటిషన్ వేయడం తప్పే
జగన్ మరోమారు జైలుకు వెళ్తే అర్ధాయుష్షు కాస్తా పూర్ణాయుష్షు అవుతుంది

ఇంటిపేరునే సిపిఐ గా మార్చుకున్న సిపిఐ నారాయణ ఏది చెప్పిన సంచలనమే అవుతుంది. రఘురామా కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలనీ పిటిషన్ వేయడం తప్పేనని కుండబద్దలు కొట్టారు. ఒక వేళ రఘురామ రాజు కోరుకున్నట్లు బెయిల్ రద్దు అయితే జగన్ కు వచ్చే నష్టం ఏమిలేదని అన్నారు. జగన్ అర్థయషు కాస్త పూర్ణయ్షుగా మరుతున్నాడని అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిలు రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్ వేయడం తప్పేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. జగన్ బెయిలు రద్దు అవుతుందో, లేదో తెలియదు కానీ రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం మాత్రం రద్దవుతుందని జోస్యం చెప్పారు. రఘురామ కోసం ఏపీలో బలమైన వైసీపీని బీజేపీ వదులుకోదని నారాయణ అన్నారు.

రఘురామరాజు కోరుకున్నట్టు బెయిలు రద్దయి జైలుకు వెళ్లినా జగన్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. గతంలో 16 నెలలు జైలులో ఉన్న జగన్ ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలిచారని, మరోసారి జైలుకు వెళ్తే ఆయన అర్ధాయుష్షు కాస్తా పూర్ణాయుష్షుగా మారుతుందని నారాయణ వ్యాఖ్యానించారు.

Related posts

వికేద్రీకరణ పై ఏపీ వ్యూహాత్మక అడుగులు …పూర్తిసమగ్రమైన మెరుగైన బిల్లు తెస్తాం :సీఎం జగన్

Drukpadam

కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం కేటీఆర్ సవాల్ … దమ్ముంటే కేసీఆర్ ను సవాల్ విసరమను అప్పడు చూస్తా బండి సంజయ్!

Drukpadam

హైదరాబాద్ లోని షర్మిల ఇంటి ముందు ఏపీ రైతుల మెరుపు ధర్నా…

Drukpadam

Leave a Comment