Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వం పదవుల పందారం… ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్ద పీఠ!

ఏపీ ప్రభుత్వం పదవుల పందారం… ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్ద పీఠ
-నామినేటెడ్ పదవులనుంచి ఎమ్మెల్యేల అవుట్
ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి నుంచి రోజా ,బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి విష్ణు అవుట్
-కాపు కార్పొరేషన్ నుంచి జక్కంపూడి రాజా అవుట్
రోజా స్థానంలో ఏపీఐఐసీ చైర్మన్ గా మెట్టు గోవిందరెడ్డి
త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం
రోజాకు కేబినెట్ లో అవకాశం ఉండొచ్చని అంచనాలు

ఏపీ లో జగన్ ప్రభుత్వం పదవుల పందేరం చేపట్టింది. ఒక్క రోజులోనే 130 పైగా కార్పొరేషన్లు ,దేవాలయాలు ,ఇతర సంస్థలకు చైర్మన్లను అధ్యక్షులను నియమించి రికార్డు సృష్టించింది. వైవి సుబ్బారెడ్డిని తిరిగి టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించింది. ఆయన అయిష్టంగానే జగన్ సూచన మేరకు రెండవసారి పదవిని అంగీకరించారు. ఈసారి బీసీ ,ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ లకు పెద్ద పీఠ వేశారు.జగన్ పదవుల నియామకంపై హర్షతి రేఖలు వ్యక్తం అవుతున్నాయి.

నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించారు. ఆమె స్థానంలో ఏపీఐఐసీ చైర్మన్ గా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు. ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండకూడదనే సీఎం జగన్ నిర్ణయంలో భాగంగా ఆమెను పదవి నుంచి తొలగించారు. రోజాతో పాటు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా కూడా నామినేటెడ్ పదవులను కోల్పోయారు.

మరోవైపు రెండో విడత కేబినెట్ విస్తరణలో రోజాకు మంత్రి పదవి లభిస్తుందని ఆమె అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత 80 శాతం మంత్రులను తొలగిస్తానని… కొత్త వారికి అవకాశం కల్పిస్తానని గతంలోనే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విస్తరణలో రోజాకు అవకాశం లభించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఏం జరగబోతోందో వేచి చూడాలి.

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవిని ఇచ్చిన జగన్
ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. ఈ రోజు నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ ను జగన్ నియమించారు. 2019 ఎన్నికల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినప్పటికీ వైసీపీ గెలుపు కోసం బైరెడ్డి కృషి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్ కు, బైరెడ్డికి అభిప్రాయ భేదాలు ముదిరాయి. ప్రతి ఎన్నికల సమయంలో తమ అనుచరుల టికెట్ల కోసం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునేవారు. కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలోనే ఇరువురూ గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి.

పాదయాత్ర సమయంలో జగన్ మాట్లాడుతూ తన మనసులో బైరెడ్డి ఉన్నాడని, కచ్చితంగా మంచి ప్రాధాన్యత ఉన్న పోస్టును ఇస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా… ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమించారు. మరోవైపు బైరెడ్డి పేరును ప్రకటించగానే బైరెడ్డి ఇంటి వద్ద పార్టీ ఆఫీసు వద్ద సందడి నెలకొంది. ఆయన అనుచరులు స్వీట్లు పంచుకున్నారు. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

కాపులకు జగన్ పెద్ద పీట వేశారు: అడపా శేషు
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా అడపా శేషు నియామకం

ఏపీ ప్రభుత్వం ఈరోజు నామినేటెడ్ పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అడపా శేషుకు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. ఈ సందర్భంగా అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కాపులకు జగన్ పెద్ద పీట వేశారని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ మరువలేదని చెప్పారు. పార్టీకి మంచి పేరును తీసుకొచ్చేలా పని చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్ అయిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా నిబద్ధతతో పని చేస్తానని చెప్పారు. కాపు కులానికి అండగా నిలబడతానని అన్నారు. కాపు కార్పొరేషన్ కు జగన్ ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు.

Related posts

ఏపీ మరింత నాశనం కాకముందే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరాం: చంద్రబాబు!

Drukpadam

పోలీసుల వలయాన్ని ఛేదించుకుని జేబీఎస్ కు వెళ్లిన సంజయ్!

Drukpadam

చంద్రబాబు కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ …

Drukpadam

Leave a Comment