Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కిని నర్సింహులు

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ టీడీపీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, నాయకత్వ లేమితో ఉన్న పార్టీకి తిరిగి జవసత్వాలను ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ నుండి చాలా మంది అభ్యర్థులు పోటీలో ఉన్న వేళ మొదటి అధ్యక్ష పదవి కోసం రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపించింది.

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలో టిడిపిని నడిపించడం తన వల్ల కాదని, పని ఒత్తిడి ఉందని చెప్పటంతో ఆయన స్థానంలో ఆ తర్వాత పలు సమీకరణాల మధ్య షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కిని నర్సింహులు పేరును తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా బక్కిని నరసింహులు పేరును ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు అధ్యక్ష రేసులో ఆశావహులను నిరాశ పరచకుండా అందరినీ సంతృప్తి పరిచేలా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా నియమించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తుంది.

అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బక్కిని నరసింహులు ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా మాజీ టిటిడి బోర్డు మెంబర్ గా ఉండడం, పార్టీ పట్ల విధేయత కలిగి ఉండటం వంటి అనేక కారణాల నేపథ్యంలో అధ్యక్షుడిగా ఆయన సమర్థుడని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో తెలంగాణ టిడిపికి కొత్త బాస్ ఖరారు అయినట్లేనని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Related posts

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు 7 పథకాలు …పసిడితో మెరిసిన నీరజ్ చోప్రా !

Drukpadam

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ పై క్యాట్ ఆగ్రహం!

Drukpadam

కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని అభినందించిన టీడీపీ అధినేత చంద్రబాబు…

Drukpadam

Leave a Comment