Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమెరికాలో స్టేడియంలో దుండ‌గుడి కాల్పులు.. న‌లుగురి మృతి

  • వాషింగ్టన్‌ డీసీలో ఘ‌ట‌న‌
  • -12 రౌండ్ల కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి
  • -మ్యాచ్ ర‌ద్దు చేసిన అధికారులు

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఓ వ్య‌క్తి 12 రౌండ్లు కాల్పులు జ‌రిపి క‌ల‌క‌లం రేపాడు. ఈ ఘట‌న‌లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. వాషింగ్టన్‌లోని నేషనల్స్‌ పార్క్‌ బేస్‌బాల్ మైదానంలో మ్యాచ్‌ జరుగుతోన్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కాల్పుల చ‌ప్పుడు విన‌ప‌డ‌గానే కొందరు ప్రేక్షకులు మైదానం నుంచి బయటకు పరుగులు తీయ‌గా, ఆటగాళ్లు కూడా పిచ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. దీంతో ఈ మ్యాచ్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కాల్పులకు తెగబడిన వ్య‌క్తికోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అధికారులు చెప్పారు.

Related posts

టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబంలో మరో విషాదం…

Drukpadam

నాగోలు ఫ్లై ఓవర్‌పై బీభత్సం సృష్టించిన ట్యాంకర్ .. కార్లు, బైకుల ధ్వంసం!

Drukpadam

టెలివిజన్ నటికి ప్రొఫెసర్ నుంచి అసభ్య సందేశాలు..

Drukpadam

Leave a Comment