Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిపక్షం….

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిపక్షం
పాల్గొన్న 33 పార్టీలకు చెందిన 40 మంది నేతలు
నిబంధనల ప్రకారం అన్ని విషయాలు చర్చిస్తామన్న ప్రధాని
కోవిద్ లో మరణించిన వారికీ నివాళులు
క‌రోనా, రాఫెల్, చైనా అంశాల‌పై ప్ర‌శ్నించ‌నున్న కాంగ్రెస్‌
గెజిట్ నోటిఫికేష‌న్ అంశాన్ని లేవ‌నెత్తాల‌ని టీఆర్ఎస్ నిర్ణ‌యం
విభ‌జన చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌ను ప్ర‌స్తావించనున్న వైసీపీ

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేప‌టి నుంచి ప్రారంభం కానున్నాయి. హాట్ హాట్ గా ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. సమావేశాలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన న్యూ ఢిల్లీ లో అఖిల పక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో 33 పార్టీలకు చెందిన 40 నేతలు పాల్గొన్నారు. దీనిలో వివిధ అంశాలను గురించి వివిధ పక్షాల నేతలు ప్రస్తహించారు. నిబంధనల ప్రకారం అన్ని విషయాలు చర్చిద్దామని ప్రదఃని అన్నారు. కోవిద్ లో మరణించిన వారికీ సమావేశం నివాళులు అర్పించింది.

కేంద్ర ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంటులో ప‌లు స‌మ‌స్య‌ల‌పై నిల‌దీసేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌ణాళిక‌లు వేసుకున్నాయి. క‌రోనాతో పాటు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌లు, చైనాతో ప‌రిస్థితులు, దేశంలో నిరుద్యోగం, ఆర్థిక ప‌రిస్థితులు వంటి అంశాల‌పై కేంద్ర స‌ర్కారుని ప్ర‌శ్నించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకుంది.

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం నేప‌థ్యంలో కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన‌ గెజిట్ నోటిఫికేష‌న్ అంశాన్ని లేవ‌నెత్తాల‌ని టీఆర్ఎస్ నిర్ణ‌యించింది. అలాగే, విభ‌జన చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌ను ప్ర‌స్తావించాల‌ని వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది. పోల‌వ‌రం నిధులు, విశాఖ ఉక్కు అంశాల‌పై కూడా ప్ర‌శ్నించ‌నుంది. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి, రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల అంశాల‌ను లేవ‌నెత్తాల‌ని టీడీపీ భావిస్తోంది.

కాగా, రేపు ఉద‌య‌దం 11 గంట‌ల‌కు పార్లమెంటు స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ్యుల్లో అధిక శాతం మంది ఇప్ప‌టికే క‌రోనా టీకాలు తీసుకున్నారు. సాగుచట్టాలపై రైతుల ఉద్య‌మం, క‌రోనా ప‌రిస్థితులు, నిరుద్యోగం వంటి అంశాలు ఈ స‌మావేశాల్లో కీల‌కం కానున్నాయి. అలాగే, పెట్రో ఉత్పత్తుల ధరలపై ప్ర‌తిప‌క్షాలు గ‌ట్టిగా నిల‌దీసే అవ‌కాశం ఉంది.

Related posts

ఎవరు ముఖ్యమంత్రి ….సిద్దరామయ్య నా ..? డీకే శివకుమార్ నా….??

Drukpadam

సీఎం పదవి కోసం మా ఇద్దరి మధ్య పోటీ ఉంటే తప్పేంటి?: సిద్ధరామయ్య

Drukpadam

గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ.. సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు!

Drukpadam

Leave a Comment