హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బందు
-ఫైలెట్ ప్రాజక్టు గా హుజురాబాద్ ఎంపిక
-ఉపఎన్నికలు ఉన్నందునే ముందుగా అక్కడ శ్రీకారం చుట్టబోతున్నారని విమర్శలు
-అదేంలేదని తిప్పికొట్టిన టీఆర్ యస్
-ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా పథకం అమలు
-త్వరలో తేదీ వెల్లడిస్తామంటున్న అధికార వర్గాలు
కేసీఆర్ దళితులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రవేశ పెట్ట బోతున్న దళిత సాధికారత పథకం ను దళిత బందు పెడుతూ అమలుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దళిత బందు పథకాన్ని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఒక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేయనున్నది . అంటే రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో ఉన్న 11 వేల 900 మందికి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే ముందుగా ఈ పథకాన్ని హుజురాబాద్ నియోజకర్గంలో ఫైలెట్ ప్రాజక్టు కింద అమలు చేయాలనీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
దళిత బందు పథకం ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలుకు కారణం లేక పోలేదు . అక్కడ తొందరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల రాజకీయ లబ్ది కోసమే హుజురాబాద్ ను ఎంచుకున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎన్నికల భయంతోనే కేసీఆర్ దళిత బందు పేరుతొ పథకాన్ని అక్కడ నుంచి ప్రారంభించ బోతున్నారని విమర్శలు ఉన్నాయి. దళితుల కోసం చేయదలుచుకున్న పథకాలపై ప్రపతిక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టి దళితుల్లో టీఆర్ యస్ పట్టును పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కేసీఆర్ అభిప్రాయం . ఒక ప్రతిపక్షాలు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని వారిమద్యనే తూర్పార బట్టవచ్చునని వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్ళుతున్నారు. అందుకే హుజురాబాద్ ను ఫైలట్ ప్రాజక్టు గా ఎంపిక చేసుకున్నారు. ఇది ఉపఎన్నికలో ఎంతవరకు సహాయపడుతుందో చూడాలి మరి ….