ఢిల్లీలో ఘటన,,, నడిరోడ్డుపై భారీ గుంతలోకి జారిపోయిన కారు
-ఢిల్లీలో భారీ వర్షాలు
-ద్వారకా ప్రాంతంలో కుంగిన రోడ్డు
-ఒక్కసారిగా పడిపోయిన కారు
-క్రేన్ తో కారును వెలికి తీసిన అధికారులు
ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రికార్డు స్థాయి వర్షాలతో దేశరాజధాని అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. ద్వారకా ప్రాంతంలోని సెక్టార్-18లో ఓ రోడ్డుపై భారీ గుంత ఏర్పడి ఓ కారు అందులోకి జారిపోయింది. భారీ వర్షాలకు రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో ఆ గుంత ఏర్పడినట్టు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో కారు కూరుకుపోవడం మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఓ భారీ క్రేన్ సాయంతో కారును గుంతలోంచి వెలికితీశారు.
కాగా, ఈ ఘటన వీడియోను పంచుకున్న ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. ఢిల్లీ సీఎంకు మాటలు ఎక్కువ, పని తక్కువ అని విమర్శించారు. రోడ్ల నిర్వహణ సరిగా లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.