ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ కరీంనగర్ కు బదిలీ
– కొత్త కలెక్టర్ గా విపి గౌతమ్
ఖమ్మం నూతన కలెక్టర్ వి పి గౌతమ్
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ను జిల్లాకు కలెక్టర్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలో కలెక్టర్ కర్ణన్ రెండున్నర సంవత్సరాల పాటు పని చేసి సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. గడచిన రెండు సంవత్సరాలుగా కరోనా కష్టాల్లో ప్రజలకు అండగా నిలిచి విశేషమైన సేవలను అందించారు. ప్రజలను ఆదుకోవడంతో పాటు లాక్ డౌన్ కష్టకాలంలో లో చేదోడువాదోడుగా నిలిచారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో కలెక్టర్ తనదైన మార్కును చూపుకున్నారు. వాస్తవానికి గత నెలలోనే కలెక్టర్ బదిలీ కావాల్సి ఉండగా, పల్లె ప్రగతి , పట్టణ ప్రగతి , హరితహారం కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా పడింది. ఆ కార్యక్రమాలు పూర్తి కావడంతో కలెక్టర్ కర్ణ న్ ను కరీంనగర్ కు కలెక్టర్ గా బదిలీ చేశారు.