Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేను రాజీనామా చేయలేదు.. చేయబోను: రఘురామరాజు స్పష్టీకరణ!

నేను రాజీనామా చేయలేదు.. చేయబోను: రఘురామరాజు స్పష్టీకరణ
రఘురామరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ప్రచారం
తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న ఎంపీ
వైసీపీ ఎంపీలు పార్లమెంటులో భయపడుతూ కనిపించారన్న రఘురామరాజు
మెగాస్టార్, పవర్ స్టార్ కంటే నాకే ఫాలోయింగ్ ఎక్కువ.. అందుకే ఎదురు డబ్బిస్తున్నారు: ఏపీ అఫిడవిట్‌పై రఘురామ ఎద్దేవా
యూరోల్లో డబ్బులు బదిలీ చేసే అలవాటు ఉండబట్టే ఆ పదాన్ని ఉపయోగించారు
ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే అఫిడవిట్
వలువల కంటే ఈజీగా విలువలు విప్పేస్తున్నారు
గిల్లికజ్జాలకు పోలవరం, ప్రత్యేక హోదా ముసుగు

ఎంపీ పదవికి తాను రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎంపీ పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. వాటిపై తాను స్పీకర్‌కు వివరణ ఇస్తానని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటుకు అవకాశమే లేదని అన్నారు.

వైసీపీ ఎంపీలు పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను లేవనెత్తడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎవరో భయపెట్టినట్టు సభలో వారు బెరుకుగా కనిపించారని అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే తనకే ఎక్కువ పాప్యులారిటీ ఉందని, అందుకే మీడియా సంస్థలు తనకు మిలియన్ల కొద్దీ యూరోలు ఇచ్చి మరీ తనతో మాట్లాడించుకుంటున్నాయంటూ ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్ని ఓ మీడియా సంస్థ నుంచి రఘురామరాజు మిలియన్ యూరోలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. యూరోలలో తనకు డబ్బులు చెల్లించారన్న దానిపై మాట్లాడుతూ.. డబ్బుల బదిలీల అలవాటున్నవారు బహుశా యూరోలలో తనకు బదిలీ చేసి ఉంటారని, అందుకే ఆ పదాన్ని ప్రయోగించి ఉంటారని ఎద్దేవా చేశారు.

సాధారణంగా అందరూ అడిగి మరీ మీడియాలో తమ వార్తలు వేయించుకుంటారని, కానీ తనకే ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొందని, ఇలా ఎందుకు దిగజారిపోతారో తనకు తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ప్రభుత్వం తనపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. అఫిడవిట్‌లో తనపై మోపిన అభియోగాలన్నీ పసలేనివేనని కొట్టిపడేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి చాలా నిస్పృహలో ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టేసి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ వాటికి ప్రత్యేక హోదా, పోలవరం నిధుల ముసుగు వేస్తున్నారని రఘురామ రాజు మండిపడ్డారు.

విలువల గురించి పదేపదే చెబుతున్న వారు వలువల కంటే సులభంగా విలువలను వలిచేస్తున్నారని అన్నారు. తనపై ఇష్టం వచ్చినట్టు పేలుతున్న విజయసాయిరెడ్డి జనసేన తరఫున నెగ్గిన రాపాక వరప్రసాద్‌ సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఎలా కలుపుకున్నారని ప్రశ్నించారు. శ్రీరంగ నీతులు చెబుతున్నవారు తనను ఏమన్నా ఫరవాలేదు కానీ, స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీని ఏమైనా అంటే బాగుండదని హెచ్చరించారు.

కులాల అంతరాలు తొలగించాల్సిన ప్రభుత్వం కార్పొరేషన్ పదవులను కులాలవారీగా విభజించి లేనిపోని అంతరాలు సృష్టిస్తోందని ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేషన్ చైర్మన్ పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని రఘురామ రాజు విమర్శించారు.

Related posts

వంగవీటి రాధా-వల్లభనేని వంశీ భేటీ.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్!

Drukpadam

శివసేనను అంతం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్న సేన ఎంపీ సంజయ్ రౌత్…

Drukpadam

బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ!

Drukpadam

Leave a Comment