Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బంతిలా ఎగిరిన కోడిగుడ్లు.. నెల్లూరు జిల్లాలో నకిలీ కలకలం

బంతిలా ఎగిరిన కోడిగుడ్లు.. నెల్లూరు జిల్లాలో నకిలీ కలకలం
-30 గుడ్లు రూ. 130కే విక్రయం
-ఎగబడి కొనుగోలు చేసిన జనం
-ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయిస్తామన్న పశువైద్యాధికారి

నెల్లూరు జిల్లాలో నకిలీ కోడిగుడ్లు కలకలం రేపాయి. గుడ్లు ఎంతకీ ఉడకకపోవడం, నేలకేసి కొడితే బంతిలా ఎగురుతుండడంతో అవి నకిలీ కోడిగుడ్లు అని కొనుగోలుదారులు ఓ నిర్ధారణకు వచ్చారు. జిల్లాలోని వరికుండపాడులో కొందరు వ్యక్తులు ఆటోల్లో తీసుకొచ్చి కోడిగుడ్లు విక్రయించారు. 30 కోడిగుడ్ల ధర రూ. 180 కాగా, తాము రూ. 130కి విక్రయిస్తున్నట్టు చెప్పడంతో జనం ఎగబడి కొన్నారు.

వాటిని ఉడికించేందుకు ప్రయత్నించగా ఎంతకీ ఉడకకపోవడంతో అనుమానం వచ్చిన ఓ మహిళ వాటిని నేలకేసి కొట్టగా బంతిలా ఎగిరిపడ్డాయి. దీంతో అవి ప్లాస్టిక్ కోడిగుడ్లుగా భావించి వాటిని కట్ చేయగా లోపల పచ్చగా ఉన్న సొన తెల్లగా ప్లాస్టిక్‌లా ఉండడంతో తాము మోసపోయినట్టు గుర్తించారు. నకిలీ కోడిగుడ్ల వ్యవహారం కలకలం రేపడంతో స్పందించిన పశువైద్యాధికారి వాటిని పరిశీలించారు. వీటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Related posts

ట్విట్టర్ పై కేంద్రం ఆగ్రహం….

Drukpadam

అనంతపురంలో భారీ వర్షం .. నీట మునిగిన కాలనీలు…

Ram Narayana

మస్కిటో కాయిల్.. ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసింది!

Drukpadam

Leave a Comment