Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో మల్లి కుంపట్లేనా ….రేవంత్ ముందు ఉన్న కీం కర్తవ్యం!

కాంగ్రెస్ లో మల్లి కుంపట్లేనా …. రేవంత్ ముందు ఉన్న కీం కర్తవ్యం!
-మరి కొద్దీ రోజుల్లో జిల్లా కాగ్రెస్ ల ప్రక్షాళనకు రంగం సిద్ధం
-అసమ్మతి వాదులు రేవంత్ రెడ్డి వెంట నడిచేందుకు తహతహ
-రేవంత్ రెడ్డి నియామకం పార్టీకి జస్వత్వాలు నింపుతుందా ?

తెలంగాణ కాంగ్రెస్ లో మల్లి కుంపట్లేనా … రేవంత్ ముందు కీం కర్తవ్యం …. ప్రజలు కాంగ్రెస్ వెంట నడద్దామన్న గ్రూప్ తగాదాలతో బెంబేలు ఎత్తుతున్నారా? కుంపట్లు లేకుండా కాంగ్రెస్ ను కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నడిపించగలడా ? 2023 చివరిలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ సైన్యం కదనరంగంలో నిలిచి అధికార టీఆర్ యస్ కు సవాల్ విసరగలదా? అనే సందేహాలు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డి నియామకంపై అసమ్మతి రాగాలు వినిపించిన కాంగ్రెస్ సీనియర్లు మెత్త బడ్డట్లు కనిపిస్తున్నారు. నిజంగా మెత్తబడ్డారా? లేదా అనేది తేలాల్సివుంది. రేవంత్ వల్ల కాంగ్రెస్ కు జవసత్వాలు వస్తాయా ?లేదా అనేది ఆయన వేసే ఎత్తులు , నడిచే నడవడిక మీద ఆధారపడి ఉంటుందనేది విశ్లేషలు అభిప్రాయం …కాంగ్రెస్ బయట శత్రువుతో పోరాటం తేలికే అయినా అంతర్గత శత్రువుతో పోరాడటం అంత తేలిక కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.

కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు కష్ట సమయంలో నాయకత్వ పగ్గాలు నెత్తికెత్తుకున్నాను. ఇందుకు ఆయన కాంగ్రెస్ లో అంతర్గత పోరాటం చేయాల్సి వచ్చింది. దాదాపు ఒక సంవత్సరకాలం వరకు కొత్త పీసీసీ చీఫ్ ను నిమించేందుకు అధిష్టానానికి సమయం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ సీనియర్ల మాటలను పక్కన బెట్టి దూకుడుగా వ్యవహరించే రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది.

రేవంత్ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది … పార్టీ ని విడి బయటకు వెళ్లాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు. వెళ్లి పోయిన వారు తిరిగి కాంగ్రెస్ చేరాలనే ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందనే ప్రచారానికి బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ వీడి అధికార టీఆర్ యస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు రేవంత్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీని వెళ్లిన వారిని రాళ్లతో కొట్టండి అని రేవంత్ ఇచ్చిన పిలుపు పెద్ద దుమారమే లేపింది. సవాళ్లు ప్రతి సవాళ్లవరకు వెళ్ళింది.

రేవంత్ మీద ఎంతో నమ్మకం, విశ్వాసంతో పార్టీ అధిష్టానం భాద్యతలు అప్పగించింది. కొంత మంది పార్టీ సీనియర్లు పార్టీని వీడతామని హెచ్చరికలు జారీచేసిన లక్ష్య పట్టలేదు . పీసీసీ చీఫ్ పదవి కోసం ఆశించి భంగపడ్డ కోమటి రెడ్డి వెంకటరెడ్డి అధిష్టానంపై , ప్రత్యేకించి ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై ఆరోపణలు చేశారు. అధిష్టానం రంగంలోకి దిగింది . ఆరోపణలపై సీరియస్ గానే స్పందించింది. దీంతో కోమటి రెడ్డి వెంకటరెడ్డి కొంత వెనక్కు తగ్గారు. పీసీసీ నియామకంపై స్పందించనని అన్నారు.

మొదటి నించి రేవంత్ రెడ్డి ని వ్యతిరేకించిన సీఎల్పీ నేత భట్టి , పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమకుమార్ రెడ్డి , ఎమ్మెల్యే లు శ్రీధర్ బాబు .జగ్గా రెడ్డి ,మాజీ ఎంపీ విహెచ్,మర్రి శశిధర్ రెడ్డి లాంటి వారు మొదట గుర్రుగా ఉన్న తరువాత సర్దుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకించి సీఎల్పీ నేత భట్టి ఢిల్లీ కి పిలిపించి మాట్లాడింది . అంతకు ముందు పీసీసీ నియామకంపై కొత్త అయిష్టతగా ఉన్న భట్టి విక్రమార్క మెత్త బడ్డారు . కోమటి రెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మినహా మిగతా అందరు రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకునే రోజు అందరు సీనియర్లు హాజరైయ్యారు.

రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకున్నాక రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కదలిక ప్రారంభమైంది. డైనమిక్ లీడర్ వచ్చాడని కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సహం వచ్చింది. రేవంత్ కూడా పార్టీ లో నిశ్శబద్ధంగా ఉన్న నాయకులను కలుస్తున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ లో ఉండి ఇతర పార్టీలలో చేరి నిరాశతో ఉన్న నాయకులను కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో రేవంత్ స్ట్రాటజీ కొంత వర్క్ అవుట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జిల్లాలలో నాయకత్వ మార్పు పై రేవంత్ ద్రుష్టి పెట్ట నున్నారు.దాదాపు అన్ని జైళ్లలో కాంగ్రెస్ కమిటీ లను పట్టాలెక్కేంచించేందుకు ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పార్టీ కు దూరంగా ఉన్న నాయకులు తమ ఖద్దరు కండువాలను భుజాన వేసుకునేందుకు సిద్దపడుతున్నారు. అదే సందర్భంలో ,ఇప్పటివరకు స్టబ్తాతగా ఉన్న అసమ్మతి కార్యక్రమాలు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కొత్త కుంపట్లకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts

చంచ‌ల్‌గూడ జైల్లోకి రాహుల్, భ‌ట్టిల‌కే అనుమ‌తి, రేవంత్‌కు నో ఎంట్రీ… కారణమేంటంటే..!

Drukpadam

ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా?: చంద్రబాబు ఆగ్రహం!

Drukpadam

నేటి సాయంత్రం బెంగుళూరుకు కేసీఆర్..ప్రధాని టూరుకు మరోసారి దూరం!

Drukpadam

Leave a Comment