విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇక చెప్పేదేమీ లేదు….కేంద్రం !
-రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు
-రాజ్యసభలో విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రశ్న
-బదులిచ్చిన కేంద్రమంత్రి భగవత్ కిషన్ రావు
-100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని ఉద్ఘాటన
-మరో ఆలోచనకు తావులేదని స్పష్టీకరణ
అనేక ఉద్యమాలు , 32 మంది ఆత్మ బలిదానాలతో , విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ హుక్కు ఫ్యాక్టరీ నేడు బీజేపీ సర్కార్ ప్రవేట్ సంస్థలకు అప్పనంగా దారాదత్తం చేసేందుకు సిద్ద పడింది. ప్రజల ,రాష్ట్ర ప్రభుత్వ , కార్మిక సంఘాల విజ్ఞప్తిని తోసిరాజని ప్రవేటీకరణ కే కట్టుబడి ఉన్నట్లు రాజ్యసభలో తెలపడం పై ఆంధ్ర ప్రజలు భగ్గుమంటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నారు. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రవేట్ పరం చేయాలనీ ఏ ఒక్కరు కోరలేదు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత ఉన్న విశాఖ ఉక్కు విషయంలో అందరి డిమాండ్ ప్రవేట్ పరం చేయవద్దని కానీ కేంద్రప్రభుత్వం ససేమీరా అంటున్నది.
విశాఖ ఉక్కుకు మైన్స్ కేటాయించాలనే డిమాండ్ ను పేడ చెవిన పెడుతుంది. నష్టాలను ఈక్విటీలుగా మార్చాలనే ప్రతిపాదనలను ,పట్టించుకోవడం లేదు . చివరికి రాష్ట్రప్రభుత్వం టేకప్ చేస్తన్న అంగీకరించటంలేదు. దీంతో విశాఖ ఉక్కు పై కార్మికుల ప్రయాజనాల కన్నా బీజేపీ కమిట్ మెంట్ కే ప్రాధాన్యత ఇస్తున్నది . ప్రవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం రాజ్యసభ సాక్షిగా మరోసారి స్పష్టం చేయడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించగా, కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మరో ఆలోచనకు తావులేదని, నూటికి నూరుశాతం ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రైవేటీకరణపై తుది నిర్ణయానికి వచ్చినందున ఇకపై చెప్పేదేమీ లేదని కేంద్రం వైఖరిని కుండబద్దలు కొట్టారు. అయితే, ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, వాటాదారుల చట్టబద్ధమైన అంశాలను పరిష్కరిస్తామని భగవత్ కిషన్ రావు వెల్లడించారు.