Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంగ్లీ బోనాల పాటపై వివాదం …. కేసు నమోదు…..

మంగ్లీ బోనాల పాటపై వివాదం …. కేసు నమోదు….
ఆ పాటలో ఎలాంటి వివాదాస్పద పదాలను వాడలేదు: మంగ్లీ వివరణ
వివాదాస్పదంగా మారిన మంగ్లీ బోనాల పాట
మోతెవరి అనే పదంపై విమర్శలు
లిరిక్ మార్చి పాటను విడుదల చేస్తున్నామన్న మంగ్లీ

టాలీవుడ్ గాయని మంగ్లీ రూపొందించిన బోనాల పాటపై వివాదం నెలకొంది. దానిపై బీజేపీ కార్యకర్త కేసుకూడా పెట్టారు. తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ఈ నెల 11న మంగ్లీ బోనాల పాటను విడుదల చేసింది. ఈ పాటలో ఉపయోగించిన కొన్ని పదాలపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ పాటపై హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంగ్లీ ఇబ్బందుల్లో పడిపోయింది. బీజేపీ కార్యకర్తలు మంగ్లీపై ఏకంగా కేసు కూడా పెట్టారు.

ఈ నేపథ్యంలో మంగ్లీ స్పందిస్తూ తాను ఎలాంటి వివాదాస్పద పదాలను వాడలేదని చెప్పింది. తెలంగాణలో గ్రామ దేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలువులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయని తెలిపింది. భక్తిలో కూడా వైరి భక్తి, మూఢ భక్తి అని వివిధ రకాలు ఉన్నాయని చెప్పింది. వీటన్నింటి నేపథ్యంలోనే ఈ పాటను రూపొందించామని తెలిపింది. ముఖ్యంగా ఈ పాటలో ఉపయోగించిన ‘మోతెవరి’ అనే పదంపై విమర్శలు వస్తుండటంతో ఈ లిరిక్స్ లో మార్పులు చేసి కొత్త పాటను రిలీజ్ చేస్తున్నామని మంగ్లీ చెప్పింది.

80 ఏళ్ల వయసున్న రచయిత రామస్వామి గారు 25 ఏళ్ల క్రితం ఈ పాటను రచించారని మంగ్లీ తెలిపింది. మోతెవరి అంటే గ్రామ పెద్ద అని అర్థమని… ఈ అర్థంతోనే పాట సాగుతుందని చెప్పింది. అయితే కాలక్రమంలో ఆ పదం వ్యతిరేకపదంగా వాడుకలోకి వచ్చిందని… యాసను వివాదం చేయడం ద్వారా ఆయనను కించపరిచే ప్రయత్నం చేయవద్దని కోరింది. ఆయన వందల పాటలు రాసిన విషయాన్నీ ఆమె గుర్తు చేసింది. మాండలికాన్ని బట్టి రచయతలు పాటలు రాశారని వాటిని ట్యూన్ కట్టి పాటపాడటమే గాయకులూ చేస్తారని ఆమె స్పష్టం చేసింది .అయినప్పటికీ దాని బాణీ మర్చిపడతామని మంగ్లీ తెలిపింది.

Related posts

ప్రొద్దుటూరు 1వ టౌన్ మహిళా ఎస్‌ఐపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

Ram Narayana

తెలంగాణ మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్

Drukpadam

These Fitness Tips Help Take Inches off Your Waistline

Drukpadam

Leave a Comment