అందరి చూపు హుజురాబాద్ వైపే …..
బీజేపీ నుంచి ఈటల , టీఆర్ యస్ ఎవరు ? కాంగ్రెస్ ఏమిటి ??
హుజూరాబాద్‌లో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పోటీ: ఆర్.కృష్ణయ్య
అన్యాయంగా తొలగించిన 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి
ధర్మదీక్షలో కేసీఆర్‌కు కృష్ణయ్య హెచ్చరిక
24న హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం
అందరిచూపు ఇప్పుడు హుజురాబాద్ వైపే ఉంది. బీజేపీ నుంచి ఈటల పోటీ ఖాయంగా కనిపిస్తున్నది. ఈటల భార్య పేరు ప్రచారంలోకి వచ్చిన ఓడిపోతామనే భయంతో తాను రంగం నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పోటీలో ఉంటారు . టీఆర్ యస్ నుంచి అనేక మంది పేర్లు షికార్లు చేస్తున్న ఇప్పటికి బలమైన అభ్యర్థి కౌశిక్ రెడ్డికే అవకాశాలు ఉన్నాయి. ఇక కాగ్రెస్ అభ్యర్థి వేటలో ఉంది. మాజీఎంపీ పొన్నం ప్రభాకర్ ను పోటీ చేయించాలని పీసీసీ చీఫ్ ఉన్న పొన్నం అందుకు సుముఖంగా లేరు. దీంతో హుజురాబాద్ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మాజీమంత్రి ఈటల భూకబ్జా ఆరోపణలలతో మంత్రివర్గం నుంచి భర్తరఫ్ తరువాత రాజకీయాలు వడివడిగా సాగాయి. మంత్రి వర్గం నుంచి తొలగాయించిన అనంతరం ఈటల బీజేపీ చేరడం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాడం చకచకా జరిగిపోయాయి. హుజురాబాద్ స్తానం ఖాళీ అయినందున ఆరునెల్లలో ఎన్నిక జరగటం అనివార్యంగా మారింది. దీంతో అన్ని రాజకీయపార్టీలు అటువైపు ద్రుష్టి సారించాయి.
బీజేపీ లో చేరిన ఈటల నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభించారు. కాంగ్రెస్ లో ఈటల కు ప్రత్యర్థిగా తలపడిన పది కౌశిక్ రెడ్డి టీఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఈటల పోటీ చేయడం అనివార్యం కాగా , టీఆర్ యస్ నుంచి ఎవరిని బరిలో దించుతారనేది ఇప్పటికి సెస్పెన్స్ గానే ఉంది. రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్న ముఖ్యనమంత్రి కేసీఆర్ మదిలో ఎవరు ఉన్నారనే విషయం బయటకు రాలేదు. అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లో చేరిన కౌశిక్ రెడ్డి కు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని అందువల్లనే ఆయన ముందుగానే తానే టీఆర్ యస్ అభ్యర్థినని చెప్పిన ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీచేస్తారు. అనేది ఇంకా స్పష్టత రాలేదు. మాజీఎంపీ పొన్నం ప్రభాకర్ ను పోటీలో నిలపాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావించిన అందుకు పొన్నం సుముఖంగా లేరని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా టీఆర్ యస్ వ్యతిరేకంగా ఉన్న ఈటల ను బలపర్చాలనే కొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. దీనికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది సాధ్యం అయ్యే విషయం కాదు . బీజేపీ అభ్యర్థిని కాంగ్రెస్ అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇందుకు ఒప్పుకోదు .
ఇది ఇలా ఉండగా తొలగించిన గ్రామీణ ఉపాధిహామీ క్షేత్ర సహాయకులను రెండు వారాల్లోగా విధుల్లోకి తీసుకోకుంటే హుజూరాబాద్‌లో వెయ్యిమంది ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలోకి దిగుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి కృష్ణయ్య నిన్న హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్ వద్ద నిన్న ధర్మదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ హెచ్చరికలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమన్నారు. ఏ తప్పు చేశారని వారిని తొలగించాలో కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 24న హైదరాబాద్‌లో అఖిలపక్షసమావేశం నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్ అణచివేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.