Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే మన తదుపరి లక్ష్యం: కేటీఆర్!

హైదరాబాద్ కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే మన తదుపరి లక్ష్యం: కేటీఆర్!
-రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు
-తెలంగాణ వర్గాల్లో సంబరం
-హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
-అందరికీ అభినందనలు అంటూ ట్వీట్

హైద్రాబాద్ కు ప్రపంచ వారసత్వ సంపద నగరంగా గుర్తింపు తేవడమే లక్ష్యం అని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. రామప్ప కు ప్రమంచపర్యాటక పటంలో చోటు లభించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు.

ములుగు జిల్లా పాలంపేటలోని 800 ఏళ్ల నాటి రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోని రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం హర్షణీయమని తెలిపారు. ఈ శుభవార్తను అందరితో పంచుకోవడం ఆనందాన్నిస్తోందని వివరించారు.

తెలంగాణ నుంచి ఇదే తొలి ప్రపంచ వారసత్వ కట్టడం అని వెల్లడించారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇక రాజధాని హైదరాబాదుకు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే తమ తదుపరి లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాలు పంచుకున్నారు.

Related posts

ఎయిర్ అంబులెన్సులో హుటాహుటిన కొడాలి నాని ముంబైకి తరలింపు…

Ram Narayana

భార‌త 15 రాష్ట్రప‌తిగా ద్రౌప‌ది ముర్ము….

Drukpadam

Drukpadam

Leave a Comment