Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. 9 మంది పర్యాటకుల మృతి..

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. 9 మంది పర్యాటకుల మృతి..
కొండపై నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన బండరాళ్లు
ధ్వంసమైన బ్రిడ్జి, పర్యాటకుల వసతి గదులు
రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర విచారం
పరిహారం ప్రకటన

కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి చెందిన దారుణ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా సాంగ్లా లోయలో జరిగింది. వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ దృశ్యాలు వివిధ ఛానళ్లలో దర్శనం ఇచ్చిన దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. కొండపైనుంచి పడే బండరాళ్లు అతివేగంగా వచ్చి బ్రిడ్జి మీద పడటంతో అది ధ్వసం అయింది. పక్కనే ఉన్న కార్లమీద బండరాళ్లు పది అనేక కార్లు ధ్యంసం అయ్యాయి. చూస్తుండగానే క్షణాలలో బండరాళ్లు మనుషులమీదకు వచ్చిపడి చనిపోయారు. అదే విధంగా కొంతమంది గాయపడ్డారు.

అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం 1.25 గంటలకు సాంగ్లా-చిట్కుల్ మార్గంలోని బట్సేరి వద్ద కొండపై నుంచి ఒక్కసారిగా దొర్లుకుంటూ వచ్చిన బండరాళ్లు లోయలోకి జారిపడ్డాయి. ఓ బండరాయి బ్రిడ్జిపై పడడంతో అది అమాంతం కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరణించిన వారిలో రాజస్థాన్‌కు చెందిన నలుగురు, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. బండరాళ్లు పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విశ్రాంతి గదులు కూడా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

Related posts

Just Two Surface Devices May Have Caused Pulled Recommendation

Drukpadam

Discussion: Millennials Aren’t All London Luvvies

Drukpadam

రేప‌టితో ముగియ‌నున్న‌ రాజా సింగ్ సంజాయిషీకి గడువు…

Drukpadam

Leave a Comment