Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నున్నా రవి మృతదేహం లభ్యం

నున్నా రవి అంత్యక్రియలలో పాల్గొననున్న మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి
ఎన్నెస్పీ కాలువలో ఈతకు వెళ్ళి గల్లంతైన రేణుకాచౌదరి వ్యక్తిగత సహాయకుడు నున్నా రవి మృతదేహం వి. వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద లభించింది. రవి రోజు లాగానే బుధవారం ఉదయం దానవాయిగూడెం సమీపంలోని మున్నేరు అక్విడెక్టు వద్దకు తన మోటరు సైకిల్ వాహనంపై ఈతకు వెళ్ళాడు. ప్రతిరోజు అక్కడ వందలమంది ఖమ్మం నుంచి వెళ్ళి ఈదు తుంటారు. అక్కడకు ఈతకు వెళ్ళిన రవి కొన్నిగంటలవరకు తిరిగి ఇంటికి చెరుకోలేదు.దీంతో కుటుంబసభ్యులు ఆరా తీశారు. రవి ఎప్పుడు ఇంత సమయం ఈతకు వెళ్ళిరాకుండా ఉండలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బంధువులు,స్నేహితుల ఇళ్ళవద్ద ఆరా తీశారు. ఈతకు వెళ్ళిన ఎన్నెస్పీ కాలువ వద్దకు వెళ్ళిచూడగా అక్కడ చెప్పులు బట్టలు కనిపించాయి.ఆయనకోసం గాలించారు.పెద్ద ఎత్తున కాలువ వెంట వాహనాలు వేసుకొని వెతికారు .కాని ఎక్కడ ఆచూకి లభించలేదు.గురువారం ఉదయం వి.వెంకటాయపాలెం డీప్ కట్టవద్ద మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. అందరితో అప్యాయంగా రవి మృతిపట్ల పలువురు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రవి అంత్యక్రియలలో పాల్గొనేందుకు రేణుకాచౌదరి హైద్రాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం చెరుకున్నారు.రవి మృతదేహాన్ని చూచి కన్నీరు మున్నీరు విలపించటం అందరిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసునమోద చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రేణుకాచాదరికి తాను మొదటిసారి 1999లో కాంగ్రెస్ తరువున ఖమ్మం లోకసభ టిక్కెట్ తీసుకుని వచ్చిన దగ్గర నుంచి ఎర్పడిన పరిచయం ఆమె అంతరంగికుడుగా చేసింది. రవి ఆమెకు నమ్మిన బంటుగా ఇంట్లోమవిషిగా ,వ్యక్తిగత సహాయకుడి గా సేవలందించారు. అందరితో కలుపు గోలుగా స్నేహ భావంతో ఉండేవారు.ఖమ్మంలో రేణుకాచౌదరి పర్యటన ఉందంటే రవి వెంట గొడుగుతో ఉండేవారు. రవి వెంటలేని రేణుకాచౌదరి పర్యటన ఊహించటమే కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .

రవి స్వగ్రామం రఘనాధపాలెం మండలంలోని కోయ చలక

ఆయనకు ఇద్దరు పిల్లలు ,భార్య ఉన్నారు.

పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జిల్లామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మృత దేహన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చరు.

అక్కడ నుంచి. కాంగ్రెస్ కార్యాలయానికి మృతదేహన్ని తరలించి కొద్దిసేపు ఉంచుతారు. అనంతరం అంత్యక్రియలు నిర్యహిస్తారు.

Related posts

The Best Exercise to Do If You Have Tight Hips

Drukpadam

ఉగాది రోజున వెంకటేశ్వరస్వామి ఆలయానికి ముస్లింలు… ఎందుకంటే..!

Drukpadam

విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం..

Drukpadam

Leave a Comment