Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’: రేవంత్ రెడ్డి…

ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’: రేవంత్ రెడ్డి…
టీఆర్‌ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా
భూమి కోసం ‘బాంఛెన్ కాల్మొక్తా’ అని ఇప్పటికీ గిరిజనులు వేడుకుంటున్నారు
ఈ పరిస్థితిని ప్రశ్నించేందుకే ఆగస్టు 9న దండోరా

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. .. ఒకపక్క హుజురానగర్ ఉప ఎన్నిక తో పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే మరో పక్క కొత్త కొత్త పథకాలతో టీఆర్ యస్ ప్రభుత్వం ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. దానిలో భాగంగానే హుజురాబాద్ పై వరాల జల్లు కురిపిస్తుంది. ప్రతి ఇంటికి ఎదో ఒక పథకం చేరేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దళిత బందు పథకంతో నియోజకవర్గంలో ఉన్న 40 వేలకు పైగా ఓటర్లను గంపగుత్తగా తమకు అనుకూలంగా చేసుకుందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కడుపు తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు పథకాన్ని స్వాగతిస్తూనే అది రాష్ట్రమంతా అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాయి. దళితులను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారని కాంగ్రెస్ మండి పడుతుంది. అందుకే దానికి ప్రతిగా కేసీఆర్ మోసాలను వివరించేందుకు దళిత గిరిజ దండోరా పేరుతొ ఆగెస్ట్ 9 న ఇంద్రవెల్లి లో పెద్ద సభ నిర్వహించబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా మోగించడానికి సన్నద్ధమవుతోన్న విష‌యం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర స‌ర్కారు చే‌సిన‌ వంచనను ఎండగడ‌తామ‌ని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 9 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్‌ 17 వరకు పల్లెపల్లెకు తిరిగి ‘దళిత, గిరిజన దండోరా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దీనిపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌రోసారి స్పందించారు. తాము ఎందుకు ఈ కార్య‌క్రమాన్ని చేప‌డుతున్నామో ఓ వీడియో ద్వారా వివ‌రించారు. భూమి కోసం ‘బాంఛెన్ కాల్మొక్తా’ అని ఇప్పటికీ గిరిజనం వేడుకుంటోన్న దృశ్యాలు కనిపిస్తోన్న స్వరాష్ట్రం. ఈ పరిస్థితిని ప్రశ్నించేందుకే నాడు క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’కు శంఖారావం పూరిస్తోంది. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ప్రశ్నించే గొంతుక నినదించబోతోంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts

ఏపీ బీజేపీకి కోర్ కమిటీని ప్రకటించిన అధిష్ఠానం…

Drukpadam

బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్​బై.. కర్ణాటకలో కొత్త పార్టీ ప్రకటన!

Drukpadam

ప్రధానిపై కేసీఆర్ పథకం ప్రకారం విషం చిమ్ముతున్నారు :కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజం!

Drukpadam

Leave a Comment