Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ శ్రేణులకు కేసీఆర్ స్వీట్ వార్నింగ్ ……

*టీఆర్ యస్ శ్రేణులకు కేసీఆర్ స్వీట్ వార్నింగ్ …..

-గాంధీ లాగా ఉండాలనుకున్నాను -తెలంగాణ ఆగం అయితదని సీఎం అయ్యా
-గీత దాటితే వేటు తప్పదని హెచ్చరిక
-పార్టీని నడపటం అంటే పాన్ డబ్బా నడపటం, పాటలు పాడటం అంత తేలికకాదని చురకలు
-సీఎం మార్పు ఉంటె నేనే చెబుతా
-నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం -వారి మాటే ఫైనల్ ,పైరవీలకు తావులేదు

టీఆర్ యస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారానికి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీట్ వార్నింగ్ తో తాత్కాలికంగా ఫుల్ స్టాఫ్ పెట్టారు. నా ఆరోగ్యం బాగుంది నేనే మరో పదేళ్లపాటు సీయం ను…… సీఎం మార్పు గురించి ఎవరు చెబుతున్నారు.లూజ్ టాక్ చేస్తే కాళ్లు విరగ్గొడతా …. క్రమ శిక్షణ గీత దాటితే కర్రుకాల్చి వాతపెడతా …..పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా ….. అన్న కేసీఆర్ ఆవెంటనే సిఎం మార్పు ఉంటే నేనే స్వయంగా చెబుతానన్నారు. గతంలో అసెంబ్లీ రద్దు చేసినప్పుడు మీకు చెప్పేచేశా ప్రగతి భవన్ కు మిమ్ములను పిలిచి నప్పుడు ఎమ్మెల్యేలుగా వచ్చారు. మాజీలుగా వెళ్లారు. ఎప్పుడైనా మార్పు ఉంటె మీతోనే పంచుకుంటానని అన్నారు. నన్ను ఇప్పుడే పొమ్మంటారా ? వెళ్లిపొమ్మంటేపోతా ? నాకేంకాదు .తెలంగాణ వచ్చిన తరువాత నేను గాంధీలాగా  ఉండాలనుకున్నా,  కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇబ్బందులకు గురియైతదని సీఎంగా భాద్యతలు స్వీకరించానని చెప్పుకొచ్చారు.

పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను సందర్భంగా వివరించారు. సీఎం సీట్లో కూర్చుని అడ్డమైన అందరితో మాటలు పడుతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు సీఎం మార్పు గురించి మాట్లాడుతున్నారు. నా ఆరోగ్యం బాగుంది. దుక్కలా ఉన్నానుఅసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం మార్పు ఉండదని ఇక సీఎం గురించి మాట్లాడటం ఆపేయండి. క్రమశిక్షణ హద్దుదాటితే ఆగమయిపోతాం అని హెచ్చరించారు. తాజారాజకీయాలు , కేంద్రంతో సంభంధాల గురించి పరోక్షంగా వివరించిన ఆయన కేంద్రంతో జరిగే అన్ని విషయాలు చెప్పటం కుదరదని కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తుంది. పార్టీలో 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు . పార్టీని రాష్ట్రాన్ని కాపాడాలి అందుకు ఏదిమంచిది ఏది చేదు అనేది ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలే సుప్రీంలు అక్కడ వారు చెప్పినవారికే నామినేటెడ్ పదవులు ఎవరు చెప్పిన వినేదిలేదు. రాబోయే ఎన్నికలలో సిట్టింగులందరి సీట్లు భరోసాఇచ్చారు . సియంఒ తో సియం తో నిత్యం సంబంధాలు ఉన్నవారే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని ప్రకటించటం పై స్పందించారు. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు . దేనికైనా సమయం సందర్భం ఉండాలని అన్నారు. కేటీఆర్ మంత్రి కావాలనే మంత్రుల మంత్రి పదవులు ఉండవని సెటైరికల్ గా అన్నారు . పార్టీని ,ప్రభుత్వవాన్ని నడపటం పాటలు పడినంత తేలికకాదని రసమయి బాలకిషన్ ఇటీవల చేస్తున్న కామెంట్లపై పంచులు వేశారు . రానున్న కాలంలో పార్టీని పటిష్టం చేయాలి . సభ్యత్వం క్యాంపైన్ నిర్వవించాలి .ఒక్కక్క నియోజకవర్గం నుంచి 50 వేలకు తగ్గకుండా సభ్యులను చేర్పించాలని కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల గురుంచి ప్రస్తావించారు. తిరిగి సాగర్ లోగాని , ఖమ్మం , వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఘనవిజయం సాధిచబోతున్నామన్నారు. పట్టభద్రుల ఎన్నికలలో మనమే గెలవాలన్నారు. గ్రేటర్ హైద్రాబాద్ కార్పొరేషన్ లో మేయర్ , డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక గురించి సీల్డ్ కవర్ లో పంపిస్తామన్నారు. ముందురోజు టీఆర్ యస్ భవన్ లో కార్పొరేటర్లతో సమావేశం ఉంటుందన్నారు. కేసీఆర్ సమావేశం తరువాత సీఎం మార్పుపై పదవి విప్పేందుకు ఎమ్మెల్యేలు మంత్రులు నిరాకరించారు . ఇప్పట్లో ఏమిలేదని పెద్ద సార్ చెప్పారు . ఇక మాట్లాడేది ఏముంది అని అన్నారు. చాలారోజుల తరువాత జరిగిన పార్టీ విస్తృత సమావేశానికి వివిధ జిల్లాల నుంచు ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమ్మెల్సీలు , జడ్పీ చైర్మన్లు , డీసీసీబీ చైర్మన్లు హాజరైయ్యారు.

Related posts

కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన జీవీఎల్ నరసింహారావు!

Drukpadam

చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ 

Drukpadam

వైసీపీలో పెరుగుతున్న అసమ్మతి!

Drukpadam

Leave a Comment