Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలుసినిమా వార్తలు

‘మా’ ఎన్నికలతో సీఎం జగన్ కు సంబంధంలేదు: మంత్రి పేర్ని నాని

  • -మా ఎన్నికల్లో రాజకీయ ప్రమేయంపై వార్తలు
  • -ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలతో మరింత వేడి
  • -స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని
  • -మా ఎన్నికలపై తమకు ఆసక్తి లేదని వెల్లడి

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రాజకీయ ప్రమేయంపై వస్తున్న వార్తల పట్ల ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ (మా) ఎన్నికలతో సీఎం జగన్ కు గానీ, ఏపీ ప్రభుత్వానికి కానీ, వైసీపీకి కానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. అసలు, ‘మా’ ఎన్నికలపై తమకు ఎంతమాత్రం ఆసక్తిలేదని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి పేర్ని నాని ఓ వీడియో సందేశం వెలువరించారు.

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రకాశ్ రాజ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలోనే ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించినట్టు తెలుస్తోంది. ‘మా’ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీలను లాగడం ఎందుకని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. జగన్ మీ చుట్టం అయినంత మాత్రాన ఆయనొచ్చి ఎన్నికల్లో ఓట్లేస్తారా? లేక ఓట్లు వేయిస్తారా? అని నిలదీశారు.

ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలకి కృతజ్ఞతలు తెలిపిన ప్రకాశ్ రాజ్

 

  • ‘మా’ ఎన్నికల్లో తమ జోక్యం ఉండబోదని, సినీ రంగానికి చెందిన ఎన్నికలపై తమకు ఆసక్తిలేదని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటనను నటుడు ప్రకాశ్ రాజ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో బాధ్యతాయుతంగా స్పందించి ప్రకటన చేశారని పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ స్పందనను గౌరవిస్తున్నానని తెలిపారు.

కాగా, సీఎం జగన్ తమ బంధువు అని ‘మా’ ఎన్నికల్లో తన ప్రత్యర్థి మంచు విష్ణు చెప్పుకుంటుండడాన్ని ప్రకాశ్ రాజ్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. బంధువైనంత మాత్రాన సీఎం జగన్ మా ఎన్నికలకు వస్తారా? అని ప్రకాశ్ రాజ్ ఓ ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు.

Related posts

ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తా: ర‌ఘురామ‌కృష్ణ రాజు సంచ‌ల‌న‌ ప్ర‌క‌ట‌న‌!

Drukpadam

బీజేపీకి అధికారం ఇవ్వండి.. నాణ్యతతో కూడిన క్వార్టర్ లిక్కర్ రూ.50కే ఇస్తాం: సోము వీర్రాజు

Drukpadam

ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణలో పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయమా?

Drukpadam

Leave a Comment