సర్పంచ్ గా గెలుపొందిన స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య
ఆమదాలవలస మండలం తొగరాంలో వాణిశ్రీ గెలుపు
ప్రత్యర్థిపై 510 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం
ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈరోజు మూడో విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్ గా ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. తన ప్రత్యర్థి పై ఆమె 510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితం వెలువడిన వెంటనే గ్రామంలోని వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమెను గ్రామంలో ఊరేగించారు.