Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణాలో కమలం జోష్…

తెలంగాణాలో కమలం జోష్
బీజేపీ లోకి క్యూkyu కడుతున్న కాంగ్రెస్ నేతలు
-కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన పాల్వాయి హరీష్
-కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదన్న హరీష్
-టీపీసీసీ అధ్యక్షుడు ఎవరో చెప్పాలని డిమాండ్
-తెలంగాణలో కమలం జోష్ పెరుగుతుండగా , కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఒక పక్క రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ కు దెబ్బమీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ నుంచి నాయకులూ బీజేపీలోకి క్యూ కడుతున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోరుబాట ,పొలంబాట , రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా యాత్రలు కాంగ్రెస్ పార్టీకి జీవంపోశాయని అనుకుంటున్నా పార్టీ నుంచి అనేక మంది నాయకులూ బయటకు వెళ్ళటం పై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది ఆపార్టీ పై తీవ్ర ప్రభావం చూపే ఆవకాశం ఉందని పరిశీలికల అభిప్రాయం . గతం లో అనేక మంది నేతలు బీజేపీలో చేరగా ఇప్పుడు మరికొంతమంది అదే దారిలో ఉన్నారు. నిన్నగాక మొన్న బలమైన కాంగ్రెస్ నేత కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలోకి చేరగా ప్రస్తుతం సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బలమైన నాయకుడుగా ఉన్న పాల్వయి హరీష్ బాబు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. బీజేపీ పార్టీ తెలంగాణాలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలను చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. 2023 టార్గట్ గా బీజేపీ పావులు కదుపుతుంది .ఇందుకోసం ఒక టీం ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో ఉన్న అసంతృపుట్లను చేరతీసేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. పాల్వయి హరీష్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళుతున్నారు అని ప్రశ్నించగా ఆపార్టీకి రాష్ట్రంలో సరైన నాయకత్వం లేదని భవిష్తలో ఉంటుందని తాను బావించటంలేదని అన్నారు. తనపై చర్యలు తీసుకునేందుకు అసలు ఎవరున్నారని అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో తేల్చుకోవాలని అన్నారు. హైద్రాబాద్ కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కూడా పార్టీలో చేరనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఫిరోజ్ ఖాన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు. అందువల్ల ఆయన కూడా ఈరోజో రేపో పార్టీలో చేరనున్నారని సమాచారం . కొంత మంది టీఆర్ యస్ నాయకులూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే ఆపార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కొంత మంది నాయకులూ అందులో ఉండటం ఇష్టం లేక పోయిన కొనసాగుతున్నారు. ఎన్నికల నాటికీ టీఆర్ యస్ నుంచి వరదలా అనేక మంది నాయకులూ తమ పార్టీలోకి రానున్నారని ఒక సీనియర్ బీజేపీ నేత పేర్కొన్నారు. అనేక మంది ముఖ్య నేతలు ఇప్పటికే తమ పార్టీతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఇందులో చాల మంది సిట్టింగులు కూడా ఉన్నారని అన్నారు.
బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపటం ఆపార్టీ నేతలకు రెట్టింపు ఉత్సహాన్ని ఇస్తుంది. బండి సంజయ్ కి ఢిల్లీలో పలుకుబడి పెరిగింది. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీ స్పీడ్ పెరగడం , దుబ్బాక, హైద్రాబాద్ ఫలితాల తరువాత బీజేపీ అగ్ర నాయకత్వానికి బండి సంజయ్ పై నమ్మకం మరింత పెరిగింది. దీంతో ఆయన తెలంగాణ విషయంలో అది చెపితే అదిచేయటానికి అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణాలో ఎంపీలు సంజయ్ తో పాటు అరవింద్ ,లో యాక్టివ్ గా పని చేస్తుండగా కిషన్ రెడ్డి కేంద్రంలో హోమ్ శాఖా సహాయ మంత్రిగా ఉన్నారు. డి కే అరుణకు కూడా కేంద్రంలో ప్రాధాన్యత గల ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. వారి ద్వారా మరికొంత మంది బీజేపీలో చేరిక రంగం సిద్ధం అవుతుందని తెలుస్తుంది.

Related posts

ముఖేశ్ అంబానీ ఇంటి ముందు బాంబుల కేసులో సంచలనం … ఈడీ ముందు శరద్ పవార్ పేరు!

Drukpadam

దొడ్డి దారిన వచ్చిన నాయకుడు తాతా మధు …ప్రజా నాయకుడు పొంగులేటిని విమర్శించడమా…?

Drukpadam

నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పే: మేకపాటి రాజమోహన్ రెడ్డి…

Drukpadam

Leave a Comment