Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పేరూరు డ్యామ్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈత విన్యాసాలు…

పేరూరు డ్యామ్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈత విన్యాసాలు…
ఈత సరదా తీర్చుకున్న హిందూపురం ఎంపీ …
అనంతపురం జిల్లాలో ఇస్తారంగా వర్షాలు …పొంగిపొర్లుతున్న డ్యాంలు
డ్యామ్ గేట్లు ఎత్తేందుకు వెళ్లిన ఎంపీ మాధవ్ ,ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
బోటులో షికారు చేసిన ఎంపీ ,ఎమ్మెల్యే
భారీ వర్షాలకు నిండిన పేరూరు డ్యామ్
గేట్లను ఎత్తి నీటి విడుదల 
గంగపూజ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్

గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీ …ఆయన ఏది చేసిన సంచలనమే … ఒకప్పుడు పోలీస్ అధికారి అయిన మాధవ్ వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి లుక్స్ లో పడ్డారు. ఇంకేముంది 2019 లోకసభ ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎంపీ గా పోటీ చేయించారు. దానితో ఆ పార్టీ తరపున ఘన విజయం సాధించిన మాధవ్ పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పార్లమెంట్ లో తనవాణిని వినిపిస్తూ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు అనంతపురంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ని వెదుర్కొని నిలబడ్డారు . పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణమ రాజు విషయంలో ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలుగు దేశం నేత పార్థసారధి పై కూడా ఫైర్ అయ్యారు.

అనంతపురం వరదల్లో నిండిన డ్యాంలను పరిశీలనకు వెళ్లిన ఎంపీ ఒక్కసారిగా నీటిలో దూకి తన ఈత విన్యాసాలను చూపించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యాన్ని గురైయ్యారు .

  • గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరు డ్యామ్ జలకళ సంతరించుకుంది. దాంతో డ్యామ్ లోని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డితో కలిసి గంగ పూజ నిర్వహించి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ గోరంట్ల డ్యామ్ లో బోటు విహారం చేశారు. అంతేకాదు, ఎంతో చలాకీగా డ్యామ్ లో ఈత కొట్టారు. పైనుంచి ఒక్కసారిగా నీళ్లలోకి దూకిన ఎంపీ  గోరంట్ల తన ఈత విన్యాసాలతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Related posts

గవర్నర్ ప్రసంగంలో పసలేదు-సీఎల్పీ నేత భట్టి

Drukpadam

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియామకం!

Ram Narayana

ఈ మాఫియా గ్యాంగ్ లో అందరూ అమ్మాయిలే!

Drukpadam

Leave a Comment