ఖమ్మం కార్పొరేషన్ ఓటర్ల మనోగతంపై టీఆర్ఎస్ సర్వే !
నగర పాలక సంస్థ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ దృష్టి సారించింది. నగర ఓటర్ల మనోభావాలను తెలుసుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత గోప్యంగా చేయించిన అంతర్గత సర్వే అనుకూలమని తేల్చినట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ వశమైన నగర పాలక సంస్థ.. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఖిల్లాపై పట్టు సాధించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ఇక సిట్టింగులు.. కొత్త ముఖాలు.. అసంతృప్తి ఉన్న ప్రాంతాలేమిటనే అంశాలపై పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.