Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అంబేద్కర్ ఆశయాల సాధనకోసమే పోటీ :ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణి

అంబేద్కర్ ఆశయాల సాధనకోసమే పోటీ :ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణి!
ఆధార్ సొసైటీ బలపరిచింది …
ఆదివాసీల హక్కుల కోసమే పోరాటం
పోడుసాగుపై ప్రభుత్వం ఆదివాసీలను నిర్బంధించింది.
ఆదివాసీల పై జరుగుతున్న దాడులు గురించి పాలకులు పట్టించుకోలేదు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసమే తాను పోటీ చేస్తున్నానని ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొండ్రు సుధారాణి అన్నారు. సోమవారం ఆమె ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు . బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఉన్నతి కొరకు నిస్వార్థంగా పని చేయడం కోసం ఆధార్ సొసైటీ బలపరిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగినదని తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఒక మహిళగా తనకు అవకాశం కల్పించిన ఆధార్ సొసైటీ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేశారు . ఆదివాసీ జాతి కోసం ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులకోసం తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఆదివాసులకు న్యాయం చేయాలని కనీసం ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల పై జరుగుతున్నటువంటి దాడులు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో కూడా కనీసం అమాయక ఆదివాసులను పోడు సాగు చేయకుండా నిర్ధాక్షణ్యంగా అనేక చోట్ల పంటలను ధ్వంసం చేయడం పట్ల ఆమె మండి పడ్డారు . అనేకచోట్ల కందకాలు తవ్వి ఆదివాసుల స్వేచ్ఛగా జీవించే హక్కును కూడా కాలరాసే విధంగా అనేక చోట్ల మహిళలపై పోడు భూముల విషయంలో అక్రమ కేసులు పెట్టే వారందరినీ జైలుపాలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ఆదివాసులను హక్కులు చట్టాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు . ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలు, దాడులు గురించి అధికారులను కలిసి గోడు వినిపించినప్పటికీ సరైన టువంటి స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఆదివాసుల యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని వారి యొక్క హక్కులను చట్టాలను పటిష్టంగా రక్షించాలని ఆదివాసుల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఆదివాసీ మహిళను ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రోత్సాహంతో బరిలో ఉన్నానని అన్నారు .

భారత రాజ్యాంగం మహిళలకు ఇచ్చినటువంటి హక్కులను పటిష్టంగా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆదిలాబాద్ లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఆదివాసి మహిళా అభ్యర్థులను నిలబెట్టడం జరిటిందని తెలిపారు .

షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలోని ఆదివాసులకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కడంలేదని ఆమె వాపోయారు . చట్టాలు ఉన్నప్పటికీ ఆదివాసి ప్రజలకు సరైనటువంటి అవకాశాలు రావడం లేదుని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు .

ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల నాయకుల సమక్షంలో ప్రతి ఒక్క ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీలు ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లి ఆదివాసుల యొక్క అస్తిత్వం కోసం మొదటి ప్రాధాన్యత ఓటును వేసి జాతి యొక్క రుణం తీర్చుకోవాలని ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క ఓటర్ ని వారింటికి వెళ్లి కోరడం జరుగుతుందన్నారు . నామినేషన్ వేయడానికి సహకరించిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు కృతఙ్ఞతలు తెలిపారు మీడియా సమావేశంలో ఆధార్ సొసైటీ అధ్యక్షులు గొంది వెంకటరమణ , కల్తీ వీరమల్లు , మెట్ల పాపయ్య , ముక్తి భాస్కర్ , కురసం సీతా రాములు, మహిళా చైతన్య శక్తి సభ్యులు శీలం దుర్గ, సోయం మంగ వేణి , అట్టాం రామలక్ష్మి పాల్గొన్నారు.

Related posts

ఓ హిందువు బ్రిటన్ ప్రధాని అయ్యాడు… మరి భారత్ లో ఓ ముస్లిం ప్రధాని అయ్యేనా?: శశి థరూర్!

Drukpadam

చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో అనేక మలుపులు …

Drukpadam

వైరా మున్సిపల్ సిబ్బందికి పెండింగ్ ఏరియర్స్ సోమ్ము చెల్లించాలని…సిపిఐ

Drukpadam

Leave a Comment