వికెట్ కీపర్ రేసులో మరో యువ ఆటగాడు.. ఇదే జోరు కనబరిస్తే ధోనీ వారసుడతనే: ఎమ్మెస్కే ప్రసాద్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌తో వికెట్ కీపర్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ధోనీ వారుసుడిగా చాలా అవకాశాలందుకున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరంభంలో అదరగొట్టిన ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. నిరాశజనక ప్రదర్శనతో చివరకు జట్టులోనే చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ను కీపర్‌గా ప్రయోగించగా అతను ఆ అవకాశాన్ని రెండు చేతులతో అందుకున్నాడు. అటు వికెట్ల వెనుకాల ఇటు బ్యాట్స్‌మన్‌గా అదరగొట్టాడు.తాజా ఐపీఎల్ 2020 సీజన్‌లో తనదైన శైలిలో చెలరేగాడు. ఇక విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడే సంజూ శాంసన్‌కు పెద్దగా అవకాశాలు రాకున్నా.. వచ్చిన వాటిని అందిపుచ్చుకోలేకపోయాడు. పైగా ఈ ఐపీఎల్‌‌లో కూడా తన పాత కథనే రిపీట్ చేశాడు. రెండు, మూడు మ్యాచ్‌లు మినహా మిగతా వాటిలో దారుణంగా విఫలమయ్యాడు.

Leave a Reply

%d bloggers like this: