ఫైర్ బ్రాండ్ సైలంట్ అయ్యారా ?

పార్టీ కార్యక్రమాలకు అందుకే దూరంగా ఉంటున్నారా ?

  • కాoగ్రేసులో ఏమీ జరుగుతుంది ?
    జిల్లారాజకీయాలలో రెండు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ఫైర్ బ్రాండ్ రేణికా చౌదరి సైలంట్ అయ్యారా అంటే అవుననే సమాధానమే వస్తుంది . 1999 ఎన్నికల్లో అనుకోకుండా ఖమ్మం లోకసభ నుంచి పోటి చేసి విజయడంకా మోగించిన రెండు దశాబ్దలుగా జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు . కేంద్రమంత్రిగా పార్లమెంటు సభ్యులుగా కేంద్రలో కీలకంగా వ్యహరించారు .సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత దగ్గరగా వున్నఅతికొద్దిమందిలో ఆమెఒకరు . కానీ ఇటీవల కాలంలో ఆమెజిల్లా రాజకీయాల్లో అంటి ముట్టనట్లగా వుంటున్నారు .ఆమెను నమ్ముకున్న కార్యకర్తలు సైతం అర్ధంకాకుండా అయోమయంలోపడ్డారు.ఎన్నికప్పుడు అదికూడ ఆమె పోటిలో ఉంటేతప్ప జిల్లా ముఖం చూడడంలేదు.ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించింది.దీనికి అనేక మంది కాంగ్రెస్ ఆగ్రనేతలు హజరైనప్పటికి ఆమె మాత్రం దూరంగా ఉంటున్నారు.దీంతో ఫైర్ బ్రాండ్ సైలంట్ అయ్యారా?అనే చర్చ జిల్లాలో నడుస్తుంది.

Leave a Reply

%d bloggers like this: