ప్రపంచ సంస్థల తీరు మారాలి ..BRICS సదస్సులో మోదీ

బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సమావేశం జరిగింది. విర్చువల్ ద్వారా జరిగిన ఈ సదస్సులో భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా నేతలు పాల్గొన్నారు. భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మోదీ ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉగ్రవాదం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలతో పాటు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UN Security Council) సంస్కరణలు రావాల్సిన అవసరాన్ని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఇండియా ప్రాధాన్యం పెరగాల్సిన అవసరాన్ని పరోక్షంగా గుర్తుచేశారు. IMF, WTO లాంటి ప్రపంచ స్థాయి సంస్థల్లోనూ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

%d bloggers like this: