పోలీస్ కమీషనరుకు తుమ్మల ఫిర్యాదు

సోషల్ మీడియాలో పోస్టింగుల పై
పోలీస్ కమీషనరుకు తుమ్మల ఫిర్యాదుచేశారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టింగుల పెట్టడంపై ఆయన ఆగ్రహం చెందారు . ఎన్నడూ పోలీస్ కమీషనర్ కార్యాలానికి రాని తుమ్మల తానే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేయడం విశేషం .అనంతరం అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనపై పోస్టింగులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు .తాను చట్టసభలో సభ్యుడను కానప్పటికీ తెరాస అధినేత కెసిఆర్ పిలిచి మంత్రి పదవి ఇచ్చారని అందువల్ల తానుపార్టీ మారే పరిస్థితే లేదన్నారు . కొందరు కావాలని చేస్తున్న పూకర్లను ఎవరు నమ్మవద్దని అన్నారు. తాను కార్పురేషన్ ఎన్నికల్లో తెరాస గెలుపుకోసం ప్రచారం చేస్తానన్నారు

Leave a Reply

%d bloggers like this: