గ్రేటర్లో ఎన్నికల వేడి
హైద్రాబాద్ మహానగరానికి డిసెంబరు 1న ఎన్నికలు జరగబోతున్నాయి.ఇటీవల కాలంలోభారీ వర్షాలు వరదలనుంచి గ్రేటర్ ప్రజలు ఇంకా తేరుకోకముందే వచ్చిన ఈ ఎన్నికల్లో పార్టీల వాగ్ధాన వరదల్లో ఓటర్లు తడిసి ముద్దైయిపోతున్నారు.అన్ని పార్టీలు ఇందుకుపోటి పడుతున్నాయి.మీకు అదిచేస్తాం ఇదిచేస్తాం అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైయ్యాయి.ఈ ఎన్నిక ప్రభావం ఒక్క హైద్రాబాద్ కే పరిమితం కాకపోవటంతో పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అభ్యర్థుల ప్రకటనలు కూడ చక చక జరిగిపోతున్నాయు.ఇప్పటికే అధికార టిఆర్ యస్ 105 మంది అభ్యర్థులను ప్రకటించింది.కాంగ్రెస్ అభ్యర్థుల వేటలో కొన్ని డివిజన్లలో ఎంపిక పూర్తి చేసింది.బీజేపీ తన సర్వశక్తులు వడ్డి గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలని చూస్తుంది. MIM తనకోటను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది.దీంతో గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.చలిలో మంటలు లేకుండానే ప్రచారం వేడిపుట్టిస్తుంది.