డైనమిక్ లీడర్ కు బ్రేకులు

రాజకీయాల్లోకి డైనమిక్ గా దూసుకొచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బ్రేకులు పడుతున్నాయి.దీంతో ఆయన అనుయాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయాల్లోకి వచ్చిన కొద్దికాలంలోనే ఖమ్మం నుంచి వైయస్ ఆర్ పార్టీ తరుపున ఎంపి అయ్యారు. అనంతరం టిక్కెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ కి గుడ్ బై చెప్పి అధికార టిఆర్ యస్ లో చేరారు.తరువాత ఆయనకు కాలంకలిసిరాలేదు. అందుకే మాజీ పార్లమెంట్ సభ్యడు అయ్యాడు .కాంట్రాక్టర్ గా వున్న ఆయన వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అరంగేట్రం చేశారు . వైస్సార్ కుటుంబానికి వున్న జనాధారణతో 2014 లో ఖమ్మం లోకసభ కు ఎన్నికయ్యారు . తెలంగాణాలో పార్టీని అభివృద్ధి చేసేందుకు శ్రీనివాసరెడ్డిని సరైన నాయకుడిగా భావించిన జగన్ తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించారు . కొద్దీ కాలం పాటు రాష్ట్రం కలియ తిరిగారు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేస్తానన్నారు .వరంగల్ పార్లమెంటుకు జరిగిన ఉపఎన్నికల్లో వైయస్ ఆర్ కాంగ్రెస్ తరపున అభ్యర్థిని రంగంలోకి దింపి తన సత్తా చాటేందుకు ప్రయత్నించారు .అనుకున్న విధంగా ఓట్లు రాకపోయేసరికి నిరాశ పడ్డారు దింతో చెప్పా పెట్ట కుండా తెరాస లోకి జంప్ చేసారు . తెరాస చెరేటప్పుడు అధినేత కేసీఆర్ తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లోఖమ్మం సిట్టింగ్ సీటు ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు .తెరాస లోకి చేరిన తర్వాత దూకుడు పెంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ఒకవర్గాన్ని ఏర్పాటు చేసికున్నారు . లోకసభకు , శాసనసభకు ఒకేసారి ఎన్నికలు వస్తాయనుకున్నారు . కానీ కెసిఆర్ తెలివిగా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లటంతో శ్రీనివారెడ్డి సీటుకు ఎసరోచ్చింది. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను మధిర ఇన్ చార్జిగా బాద్యతలు తీసుకున్నారు అక్కడ నుంచి తన అనుయాయుడిగా ఉన్న లింగాల కమల్ రాజుకుటిక్కెట్ ఇప్పించుకున్నారు . అయనప్పటికీ ఆసీటు గెలవలేదు . పైగా వైరా నియెజకవర్గంలో అధికార అభ్యర్థిగా వున్నా మదన్ లాల్ కు వ్యతిరేకంగా ఇండిపెండెంటుగా పోటీచేసిన రాములునాయక్ ను బలపరిచారు . ఆయన గెలుపొందడంతో ఆయన్ను తీసుకొని మీరు పెట్టిన అబ్యర్దిని ఓడించిన వాడని పరిచయం చేసారు . ఈ సంఘటన కెసిఆర్ కు ఇబ్బందికరంగా మారిందనే వార్తలు వచ్చాయి. దీనికితోడు ఆయన దూకుడు జిల్లాలో అనేక మందికి కంటగింపుగా మారింది . దీంతో ఆయనకు తిరిగి పార్లమెంట్ టిక్కట్ రాకుండా అనేకశక్తులు అడ్డుకున్నయనే అభిప్రాయాలు ఉన్నాయి.ఇదేమంటే సామజిక ‘సమీకరణాలన్నారు . రాజ్యసభకు పంపుతామని హామీ నిచ్చారు . ఆ ఎన్నికలు వచ్చాయి .కానీ సీటు మాత్రం శ్రీనివాసరెడ్డికి రాలేదు .ఎమ్మెల్సీ వస్తుందనే ప్రచారం జరిగింది ఆదిరాలేదు .వైస్సార్ కాంగ్రెస్ నుంచి తెరాస లో చేరినా ఒరిగింది ఏమీలేదనేది ఆయన అనుయాయుల మాట . అవినప్పటికీ ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు . అన్న , అక్క అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు .తమ అధినేత కేసీఆర్ కనికరించకపోతాడా అనే ఆశతో వున్నారు . అనుయాయులు మాత్రం ఇంకా ఎంతకాలం ఓపిక పట్టడం అంటూ ఆయనపై వత్తిడి తెస్తున్నారు .రాజకీయాల్లో ఏమైన జరగవచ్చనే నానుడి నిజమౌతుందా?లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Leave a Reply

%d bloggers like this: