మాస్క్ మస్ట్

మాస్క్ మస్ట్
ఇది నేడు ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్నచర్చ .కోవిద్-19 గత 11 నెలలుగా ప్రపంచ లోని 200 కు పైగా దేశాలను వణికిస్తున్నది .ఈ జబ్బుకు నివారణ చర్యలే ప్రధానం అంటున్నారు డాక్టర్లు,శాత్రవేత్తలు . ఇప్పటికే కోటిమందికిపైగా దీని భారీనపడ్డారు . తాజా లెక్కల ప్రకారం ప్రపంచలో 6 కోట్లకు చేరువలో కరోనా వ్యాధి భారీనపడ్డారు . అభివృద్ధి చెందిన అగ్ర రాజ్యలుసైతం దీనినుంచి తప్పిచుకోలేక పోయాయి . అమెరికా లో కోటి 20 లక్షల మందికి ఈ వ్యాధిసోకగా ఇప్పటి వరకు 2 లక్షల 58 వేలమంది మరణించారు .మన దేశంలో ఇప్పటికే 90 లక్షల మందికి ఈ వ్యాధిసోకింది . లక్ష 32 వేల మందికి పైగా మరణించారు . ఇంకా బ్రెజిల్ ,ఫ్రాన్స్ రష్యా , స్పెయిన్ ,బ్రిటన్ , ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు దీనినుంచి తప్పించు కోలేకపోయాయి . ప్రస్తుతం దీనికి వ్యాక్సిన్ ఇంకారాలేదు . వ్యాక్సిన్ కోసం అనేక దేశాలలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇదిగో అదిగో అంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని దేశాలలో సెకండ్ వేవ్ ,థర్డ్ వేవ్ అంటున్నారు . దీంతో ప్రజలు వణికిపోతున్నారు . అనేక దేశాలలో బతుకుదెరుకోసం వెళ్లిన మనవాళ్ళబతుకుజీవుడా అంటూ తిరిగి వస్తున్నారు. ఇటలీ జైళ్లలో ఖైదీలకు కరోనా సోకి అనేక మంది మరణించటంతో ఖైదీలను సైతం వదిలి పెడుతున్నారు. అనేక దేశాలలో వున్న మన దేశ పిల్లలు తల్లిదండ్రలకోసం ఆరాతీస్తున్నారు .తమపిల్లలు ఎలా వున్నారోననే కంగారు ఇక్కడ వున్న తల్లి దండ్రులు వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లో తిరిగి వ్యాధి విజృంబిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి .ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అఖిల పక్ష సమావేశం వేర్పాటుచేసి ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు చేపట్టారు . ఇందులో భాగంగానే మాస్క్ మస్ట్ అంటూ ఉత్తర్వులు జారీచేశారు లేకపోతె 2 వేల రూపాయల ఫైన్ తప్పదన్నారు . అనేక దేశాలలో ఫైన్ ఇంతకన్నా ఎక్కువగానే వుంది . వ్యాక్సిన్ కోసం ప్రపంచం అంతావేయి కళ్ళతో ఎదురుస్తున్నది. వ్యాక్సిన్ త్వరగా వచ్చి ప్రపంచ మానవాళిని రక్షిస్తుందని ఆశిద్దాము.

Leave a Reply

%d bloggers like this: