ఖమ్మం జిల్లా టీ ఆర్ యస్ లో కోల్డ్ వార్


ఎవరు అవునన్నా కాదన్న ఖమ్మం జిల్లా టీ ఆర్ యస్ లో కోల్డ్ వార్ నడుస్తున్నది . దీనికి కారణం ఏమిటి? ఎవరు బాధ్యులు అంటే ఏఒక్కరినో నిందించటం అన్యాయమే అవుతుంది .ఇందుకు అందరు సమానంగా బాధ్యత వహించాలి .  ముఖ్యనేతలంతా ఆత్మవిమర్శ చేసుకోవలసిందే .తుమ్మల , అజయ్ మీదనో లేక అజయ్ తుమ్మలమీదనో లేక పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీదనో పంతాలకు పట్టింపులకు పొతే, రానున్నకాలంలో అందరి పుట్టిమునగటం ఖాయంగా కనిపిస్తున్నది . ఇప్పటికే జిల్లా టీ ఆర్ యస్ లో జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం బహిరంగ యుద్ధంగా మారుతుంది. దీనివల్ల భవిష్యత్ లో పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగావున్నాయనేది పరిశీలకుల అభిప్రాయం . ప్రస్తుత రాజకీయ పరిస్థితులు టీ ఆర్ యస్ కు అంత సానుకూలంగాలేవు. ఈ పరిస్థుతులలో పార్టీలోని నాయకులను , కార్యకర్తలను సమన్వయము తో నడిపించాల్సి ఉంది . పార్టీలో తమకు సరైన ఆదరణ లభించటం లేదనే వారు ఆవకాశం కోసం ఎదురుచూస్తున్నారు . జిల్లాలో ఉన్న అసంతృప్తులను చల్లార్చేందుకు కేసీర్ దృష్టి పెట్టాల్సివుంది . ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు జిల్లాలో జరగుతున్న పరిణామాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు . ఎమ్మేల్యేల అనుమతి లేకుండా ఆయన నియోజకవర్గాలలో పర్యటించటంలేదు. తనకేందుకులే పంచాయతీ అనే దోరణితో ఉంటున్నారు . తనదైన శైలిలో వ్యహరించేందుకు నిర్ణయించుకున్నట్లు ఉన్నారు . జిల్లాలో పార్టీ పరిస్థిపై అధినేత సూచనలకనుగుణంగా కీలక నేతల మధ్య సమన్వయం చేసేందుకు కొంత ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. ఫలితంగానే పువ్వాడ కుటుంబం వేర్పాటు చేసిన రైతు వేదిక ప్రారంబోత్సవానికి తుమ్మలను సైతం ఆహ్వానించటం , తుమ్మల ఇంటికి అజయ్ వెళ్లటం లాంటి కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి . అంతా అయిపొయింది నాయకులంతా కలిసి పోతున్నారు అనుకునే లోపలే ఖమ్మంకు చెందిన కొందరు తుమ్మలకు వ్యతిరేకంగా అసభ్యపదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టడం నేతల మధ్య దూరాన్ని మరింత పెంచింది . దీన్ని సీరియస్ గా తీసుకున్న తుమ్మల స్వయంగా కమిషనర్ ఆఫ్ పోలిస్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు . తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నా ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు . పాలేరులో ఓటమికి నైరాశ్యం చెంది సైలెంట్ గా ఉన్న ఆయన తనపై వస్తున్నా పుకార్లపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తనస్వగ్రామం గండుగుపల్లిలో వ్యసాయం చేసుకుంటూ అప్పుడప్పుడు ఖమ్మం , హైదరాబాద్ కు తిరుగుతున్న తుమ్మల జిల్లా పార్టీ వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకోవటం లేదు .కానీ తనపై జరుగుతున్నా తప్పుడు ప్రచారాలను దీటుగా తిప్పి కొట్టేందుకు సిద్దపడుతున్నారు .సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పై స్పందిస్తూ తనకు రాజకీయాలు తెలవక,చేయటం చేతకాక కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇక యుద్దానికి సిద్దమైనట్లేననే సంకేతాలు ఇచ్చారు .మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలో ఇబ్బందికరంగానే ఉన్నారు .2014 ఎన్నికల్లో వై యస్ ఆర్ కాంగ్రెస్ తరుపున విజయం సాదించి తెలంగాణలో ఆపార్టీ అధ్యక్షుడిగా ఉండి జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లు గెలిపించి తరువాత అధికార టీఆర్ యస్ లో చేరారు. తన చేరిక సందర్బంగా తన సీట్టింగ్ సీటు ఖమ్మంను తిరిగి తనకే ఇస్తాననే హామీని కేసీఆర్ నుంచి పొందారు.కాని 2019 ఎన్నికల్లో సామాజిక సమీకరణల నేపద్యంలో ఆయనకు సీటు రాలేదు.రాజ్యసభ ఇస్తామనే మాట ఇచ్చారు.కాని అది జరగలేదు . మంత్రి అజయ్ జిల్లాలో తన ముద్ర వేసేందుకు కష్టపడుతున్నా సమన్వయము చేయటంలో ఇబ్బదులుపడుతున్నాడనే అభిప్రాయాలువున్నాయి . ఎమ్మెల్యేలు ఎవరికివారే వ్యవహరిస్తున్నారనే మాటలు విపిస్తున్నాయి . గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల కొంత సడలింపు ధోరణితో వ్యవరించేవారు .కానీ అజయ్ పట్టువిడుపులు లేకుండా ముక్కుసూటితనంతో వెళ్ళటం కొంతమందికి నచ్చటం లేదు . 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతటా తెరాస గాలి వీచింది . ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఘనవిజయం సాధించాయి . అంతకుముందు పాలేరు ఉపఎన్నికల్లో 52 వేల భారీమెజార్టి తో విజయం సాధించిన తుమ్మల తిరిగి 2018 లో మంత్రిగావుండి అదేపాలేరు నుంచి పోటీచేసి కారణాలు ఏమైనప్పటికి గెలవలేకపోయాడు. ఉమ్మడిఖమ్మం .జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు ఖమ్మం సీటు మాత్రమే టీ ఆర్ యస్ గెలిచింది . అదికూడా పువ్వాడ అజయ్ మిత్రపక్షాల అభ్యర్ది గా పోటీచేసిన నామ నాగేశ్వరావు ను ఓడించి జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్కడుగా నిలిచాడు . దీంతోఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొంత ఆలశ్యంగానైనా కేసీఆర్ తన మంత్రివర్గంలోకి అజయ్ ని తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది . తన ఓటమికి కారణం అయినవారిని అందలం ఎక్కిచటంపై తుమ్మల పైకి చెప్పకపోయినా మధనపడుతున్నారు . అసలుకారణాలు ఆయనకు తెలియందికాదు . సుదీర్ఘ రాజకీయ అనువభవం ఉన్న తుమ్మల జిల్లాలో రెండవ తరాన్ని గైడ్ చేయాల్సింది పోయి తన ఓటమికి ఎవరో కారణమంటూ సాకులు వెతుక్కోవటం సరైంది కాదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . జిల్లాలో టీ ఆర్ యస్ బలమైన శక్తిగా ఉంది . అయితే గతంలో లాగా ఏఒక్కరో పార్టీని తమ కనుసన్నల్లో నడిపించాలంటే కుదిరేపనే కాదు అనేది గ్రవించకపోతే కోల్డ్ వార్ బహిరంగ వార్ గా మారటం ఖాయం .

2 thoughts on “ఖమ్మం జిల్లా టీ ఆర్ యస్ లో కోల్డ్ వార్

Leave a Reply

%d bloggers like this: