గ్రేటర్ ఫైట్ బలే పసందు

గ్రేటర్ ఫైట్ బలే పసందు గా మారింది .సవాళ్లు ,ప్రతిసవాళ్ళతో ,తిట్లు ,శాపనార్దాలతో ప్రచారం రసవత్తరంగా ఉంది . ఇక పార్టీల ఎన్నికల ప్రణాళికలతో ఓటర్లు తడిసి ముద్దావుతున్నారు . మినీ అసెంబ్లీ ఎన్నికలని తలపిస్తున్న ఈఎన్నికలు దేశరాజదానిని సైతం తాకాయి . ఢిల్లీ లీడర్లు సైతం హైద్రాబాద్కు పరుగులు తీస్తున్నారు . కరోనా కాలంలో సైతం రాజకీయపార్టీల దృష్టి హైదరాబాద్ వైపు మరలింది .బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు,బీజేపీ బడానేతలు ఎన్నికలప్రచారంలో పాల్గొంటున్నారు . తెలంగాణ రాష్ట్రం మొత్తం హైదరాబాద్ లోనే మాకంవేసింది. అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతల కేరాఫ్ హైద్రాబాద్ గా మారింది . దీనితో లాడ్జిలు నిండిపోయాయి . అపార్ట్ మెంట్లు సైతం ఖాళీగాలేవు . డిసెంబర్ 1 న జరగనున్న బల్దియా ఎన్నిక కురుక్షేత్రాన్ని తలపిస్తున్నది . సభలు, సమావేశాలు, రోడ్ షోలూ,పార్టీల జెండాలు , బేనర్ల , ఫ్లెక్స్ లతో హైద్రాబాద్ కోలాహలంగా మారింది . కరోనా ఉన్నదనే విషయాన్నే మరచి మరీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వయిస్తున్నారు. ఫలితంగా వేలసంఖ్యలో ప్రజలు గుమికూడుతున్న పట్టించుకున్న వారులేరనే విమర్శలు ఉన్నాయి . నిన్నగాక మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలవటంతో టీ ఆర్ వైస్ ను సైతం ఉలిక్కిపాటుకు గురిచేసింది . దీనితో ఎన్నికలకు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది . టీ ఆర్ వైస్ , బీజేపీ, కాంగ్రెస్,ఎం ఐ ఎం ,పోటిపడుతున్నా, టీ ఆర్ వైస్ , బీజేపీ, మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నది . ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉంది . కొన్ని సందర్భాలలో అవి శృతిమించుతున్నాయనే విమర్శలుకూడా వెల్లువెత్తుతున్నాయి . మొదటినుంచి బల్దియా పై కొంతపట్టు ఉన్న బీజేపీ దుబ్బాక విజయం తో ఉరకలు వేస్తున్నది . కోటిమందికి పైగా ప్రజలు నివసిస్తున్న హైదరాబాద్ మహానగరంలో 74 లక్షల మంది ఓటర్లు ఉన్నారు . 150 డివిజన్లు ఉన్నాయి . తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో జెండా ఎగరవేయటం ద్వారా రానున్న కాలంలో తెలంగాణలో తమ సత్తా చాటాలని కమలదళం గట్టి పట్టుదలతో ఉంది . తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీ ఆర్ వైస్ 2014 ,2018 ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రము లో పటిష్టమైన పునాదులు వేసుకుంది . గత ఎన్నికల్లో 99 డివిజన్లలో విజయ బావుటా ఎగరవేయటం ద్వారా టీ ఆర్ యస్ మేయర్ పీఠాన్ని దక్కిచుకున్నది . పాతబస్తీలో తిరుగులేని శక్తిగా MIM ఉంది . సుదిర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రంలో పాలనా సాగించిన కాంగ్రెస్ పోటీలో ఉంది. వీరు కాకా ఇండిపెండెంట్ లు , లెఫ్ట్ పార్టీలు బరిలో ఉన్నాయి . ఈసారి ఎన్నికలు టీ ఆర్ యస్ కు గతంలోలా కేక్ వాక్ మాత్రం కాదు . కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైద్రాబాదులో పట్టు సాధించటం ద్వారా తెలుగు రాష్ట్రాలలో పార్టీని పటిష్టం చేసుకోవాలని ఎత్తులు వేస్తుంది . విశ్వ నగరం కావాలో విష నగరం కావాలో ప్రజలు తేల్చుకోవాలని టీ ఆర్ యస్ నేత కే టీ ఆర్ ఓటర్లకు పిలుపునిస్తున్నారు . ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి , ప్రజలను మాయ మాటలతో మోసం సేస్తున్న టీ ఆర్ వైస్ కావాలో జనరంజకమైన మోడీ అచుగు జాడల్లో నదుస్తున్న బీజేపీ కావాలో ఓటర్లు నిర్ణయించు కోవాలని బీజేపీ కోరుతుంది . కాంగ్రెస్ హైదరాబాద్ అభివృద్ధికి కారణం తామేనంటున్నది . మొత్తానికి అన్ని పార్టీలు ఎన్నికల హీట్ ను పెంచాయి . ఓటర్ దేవుళ్ళు ఎవరిని కరుణిస్తారో డిసెంబర్ 4 న తేలనుంది .

Leave a Reply

%d bloggers like this: