బీజేపీ మాస్టర్ ప్లాన్

దుబ్బాక స్ఫూర్తి తో గ్రేటర్ పీఠమే లక్ష్యంగా తెలంగాణాలో బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నది .అందులో భాగంగానే హైదరాబాద్ కార్పొరేషేన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది .ఇందుకోసం బీజేపీ కేంద్ర నాయకత్వ్య మే స్వయంగా పర్వవేక్షిసుంది . మహారాష్ట మాజీ సీఎం ఫడ్నవీస్ గ్రేటర్ ఎన్నికలకోసం రంగంలోకి దించింది . హోమ్ మంత్రి అమీత్ షా , యు పీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ,పలువురు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు . ప్రచారం చివరి రోజు ప్రధాని హైద్రాబాద్ రానున్నారు . దీన్నిబట్టే ఈ ఎన్నికని బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొందో అర్దమవుతుంది . 2023 ఎన్నికల్లో తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది . అందుకనుగుణంగా యంత్రాగాన్ని సిద్ధం చేస్తున్నది . కేంద్రం లో అధికారంలో ఉండటంటం బలమైన లీడర్ షిప్ ఆపార్టీకి ప్లస్ పాయింటుగా మారింది .ప్రధాని మోడీ ,హోమ్ మంత్రి అమీత్ షా ల దృఢవైఖరి ఆపార్టీ శ్రేణులకు ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి . ప్రజలని ఆలోచింప జేస్తున్నాయి . తెలంగాణాలో కాంగ్రెస్ బలహీన పడటంతో ఆస్థానం భర్తీ చేసే ఆవకాశం కేవలం బీజేపీ మాత్రమే ఉందని ప్రజలు నమ్ముతున్నారు . అందివచ్చిన అవకాశాన్ని జారవిడచ కోకుడదనే నానుడితో బీజేపీ హైదరాబాద్ కార్పొరేషాన్ ఎన్నికలను సవాల్ గా తీసుకుంది . కెసిఆర్ కేవలం మాటల ముఖ్యమంత్రి మాత్రమేనని గత ఆరు సంవత్సరాల పాలనలో చేసింది ఏమిలేదని చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మేలా చేస్తుంది . దళిత ముఖ్యమంత్రి , దళితులకు మూడు ఎకరాల భూమి , నిరుద్యోగులకు భృతి , ఉద్యోగాలు కలిపిస్తామని చేసిన వాగ్దానాలు నెరవేరలేదు ఉద్యోగులకు పీ ఆర్ సి ,వయోపరిమితి పెంపు రైతులకు రుణమ్హాఫి , డ్వాక్రా మహిళలకు ఇలా అనేక వాగ్దానాలు చేసి నిలబెట్టుకోలేదనే విమర్శలు ఉన్నాయి . అయితే చేయని వాగ్దానాలు కూడా చేశామని చెబుతున్న వాటిని ప్రజలు స్వీకరించినట్లు అనిపించటం లేదు . పైగా పాలనా అంతా కుటంబం చేతుల్లోనే ఉందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది . చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీల మాటలకూ విలువలేదనే అసంతృపి ఉంది . పార్టీలో నిర్మాణం లేకపోవటం , జిల్లా కమిటీలను నియమించకపోవడం టీ ఆర్ యస్ కు మైనస్ గా మారాయి . తెలంగాణ ఉద్యమం సబ్బండ వర్గాల ఉద్యమం .లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు . అనేక మంది యువకులు తమ ప్రాణాలను ఆత్మార్పణ చేసుకున్నారు . ఉద్యమంలో పాల్గొన్న వారికీ న్యాయం జరగక పోగా వారిపట్ల చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి . అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని అందలం వెక్కిచటం పై తెలంగాణ సమాజం గుర్రుగా ఉంది . అంతేకాకుండా పాతబస్తీలో అల్లర్లకు కారణం అవుతున్న పక్కా మతతత్వ పార్టీగా ఉన్న ఎం ఐ ఎం తో స్నేహపూర్వకంగా ఉండటం మెజార్టీ గా ఉన్న హిందువులకు కంటగింపుగా ఉంది . మతాలను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందాలని ఇటు బీజేపీ అటు ఎం ఐ ఎం చూస్తున్నాయి . దీంతో ప్రజలు ఉంటె ఎం ఐ ఎం లో లేదంటే బీజేపీలో ఉండాలనే అభిప్రాయాన్ని రెండు పార్టీలు కలిగిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ,బీజేపీ , ఎం ఐ ఎం లు కత్తులు దూస్తున్నాయి. ప్రజల్లో ఉన్న హిందూ సెంటిమెంటును ఉపయోగించుకోవటం ద్వారా మేయర్ పీఠంపై కాషాయ జెండా వేగరవేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది . ఆపార్టీ కేంద్ర నాయకత్వం కూడా సంపూర్ణ సహకారం అందించటంతో వివిధ పార్టీలలో ఉన్న అసంతృప్తులను చేరతీసేందుకు గాలం వేస్తుంది . టీ ఆర్ యస్ ముఖ్య నేత ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన స్వామిగౌడ్ బీజేపీలో చేరటం , కాంగ్రెస్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేరుతున్నట్లు ప్రకటించటం , విజయశాంతి రేపో మాపో చేరుతారనే ప్రచారంతో పాటు మాజీ ఎంపీ కొండా ఈశ్వేశ్వర రెడ్డి లైన్లో ఉన్నాడని వార్తలు రావటం బీజేపీకి సానుకూల పరిణామాలుగా ఉన్నాయి . రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీన పరచటం ద్వారా లబ్ధ్ది పొందాలనే కెసిఆర్ వ్యూహం బీజేపీకి అనుకులంగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు గ్రేటర్లో బీజేపీ పీఠం దక్కించుకున్నా ,లేకపోయినా కనీసం 30 డివిజన్లు గెలిస్తే రానున్న కాలంలో తెలంగాణ లోఅధికారంలోకి రాకుండా బీజేపీని ఏశక్తి అడ్డుకోలేదని అభిప్రాయాలూ బలంగా వినిపిస్తున్నాయి . చూద్దాం రానున్నకాలంలో ఏమి జరుగుతోందో ?

2 thoughts on “బీజేపీ మాస్టర్ ప్లాన్

  1. మీ అనాలసిస్ బాగుంది. ‌మీరనట్టు BJP కేంద్రం లొ అధికారం లొ ఉండటం రాస్ట్ర పార్టీ కి కొండంత అండే అని చేప్పాలి. TRS కి జిల్లా స్థాయి లొ జిల్లా కమిటీ లు లేకపొవడం భవిష్యత్తులో పార్టీ కి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

%d bloggers like this: